పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం
ABN , Publish Date - Apr 22 , 2026 | 08:31 AM
పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో నాటు బాంబులు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాడుబడ్డ ఇంట్లో దొరికిన ఈ బాంబులు గ్రామంలో భయాందోళనలకు గురిచేశాయి. వివరాల్లోకి వెళితే..
బెల్లంకొండ, ఏప్రిల్ 22: పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో నాటు బాంబులు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాడుబడ్డ ఇంట్లో దొరికిన ఈ బాంబులు గ్రామంలో భయాందోళనలకు గురిచేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు ఐదు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి చెందిన ఇంట్లో ఈ బాంబులు దొరకడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. పాత కక్షల నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలకు ప్లాన్ చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. బాంబు స్క్వాడ్ సహాయంతో గ్రామంలోని పలు అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఎక్కడైనా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారా అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.