Share News

ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తున్నాం..

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:57 PM

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ 22 నెలల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు.

ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తున్నాం..
MLA Paritala Sunitha

  • ఎమ్మెల్యే పరిటాల సునీత

రాప్తాడు(అనంతపురం): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ 22 నెలల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. గొందిరెడ్డిపల్లి నుంచి పుల్లలరేవు వరకూ రూ.1.30 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు, పుల్లలరేవులో రూ.50 లక్షలతో వేసిన సీసీ రోడ్లను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ 22 నెలల్లోనే రాప్తాడు మండలంలో రూ.26 కోట్లతో రోడ్లు వేశామన్నారు.


PARI.jpgగొందిరెడ్డిపల్లి నుంచి పుల్లలరేవు వరకూ తారు రోడ్డు నిర్మించామన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ది పనులు చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల ఇన్‌చార్జి ధర్మవరపు మురళి, మండల కన్వీనర్‌ కొండప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ సాయినాథ్‌, నల్లాని ప్రసాద్‌, జాఫర్‌, గంగలకుంట రమణ, మరూరు గోపాల్‌ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం

అమరావతి పనులకు వేగంగ ఇసుక, కంకర

Read Latest Telangana News and National News

Updated Date - Apr 22 , 2026 | 12:58 PM