Share News

రాయలసీమను సస్యశ్యామలం చేసిన భగీరథుడు సీఎం చంద్రబాబు: మంత్రి సవిత

ABN , Publish Date - Jun 07 , 2026 | 05:33 PM

ఏడారిగా ఉన్న రాయలసీమను సస్యశ్యామలం చేసిన భగీరథుడు సీఎం చంద్రబాబు అని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. రాయలసీమలోనూ ఆక్వా కల్చర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం సహకరిస్తోందని పేర్కొన్నారు.

రాయలసీమను సస్యశ్యామలం చేసిన భగీరథుడు సీఎం చంద్రబాబు: మంత్రి సవిత
AP Minister Savitha

అనంతపురం, జూన్7 (ఆంధ్రజ్యోతి): ఏడారిగా ఉన్న రాయలసీమను సస్యశ్యామలం చేసిన భగీరథుడు సీఎం చంద్రబాబు అని మంత్రి సవిత (AP Minister Savitha) వ్యాఖ్యానించారు. రాయలసీమలోనూ ఆక్వా కల్చర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం సహకరిస్తోందని పేర్కొన్నారు. బీసీల అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. ఈరోజు(ఆదివారం) అనంతపురం నగరంలో బెస్త సేవ సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు.


బెస్త సేవ సంఘం అధ్యక్షులుగా చేపల హరి, ప్రధాన కార్యదర్శిగా భాస్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. బెస్తల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. చేపల వేట నిషేధ సమయంలో రూ.20 వేలు అందించేలా ఎన్నికల హామీని తాము నెరవేర్చామని ప్రస్తావించారు. కులవృత్తి చేసుకోవడానికి రాయితీపై పరికరాలు అందజేస్తున్నామని వెల్లడించారు. చేపల ఉత్పత్తిలో ఏపీనే మొదటి స్థానంలో ఉందని వివరించారు. ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి సవిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

గొడ్డలి పార్టీ ఆగడాలు శ్రుతిమించితే వదిలిపెట్టం.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

జగన్ హయాంలో ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారు: హోంమంత్రి అనిత

Read Latest Telangana News And AP News  And National News

And Telugu News

Updated Date - Jun 07 , 2026 | 05:35 PM