Share News

మంత్రి చొరవతో గుండె మార్పిడి

ABN , Publish Date - Feb 24 , 2026 | 10:38 AM

రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ చొరవతో ఓ యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ హరీశ్‌బాబు తెలిపారు.

మంత్రి చొరవతో గుండె మార్పిడి

  • కదిరి యువకుడికి ప్రాణదానం

ధర్మవరం(అనంతపురం): రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ చొరవతో ఓ యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ హరీశ్‌బాబు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. కదిరి(Kadiri) పట్టణానికి చెంది చరణ్‌కుమార్‌ అనే యువకుడు గుండెసమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు అతడికి అత్యవసరంగా హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు ధర్మవరంలోని మంత్రి కార్యాలయాన్ని సంప్రదించారు.


విషయం మంత్రి దృష్టికి చేరగానే ఆయన తక్షణమే స్పందించి రోగిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని వైదేహి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌సైన్సెన్‌ అండ్‌ రీసెర్ట్‌ సెంటర్‌కు రెఫర్‌ చేయాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అక్కడి వైద్యులతో స్వయంగా మాట్లాడి రోగికి అవసరమైన అన్ని వైద్యసదుపాయాలు కల్పించాలని కోరారు. వైదేహి ఆసుపత్రి వైద్యబృందం సమగ్ర పరీక్షలు నిర్వహించింది.


pandu1.jpgబ్రెయిన్‌ డెడ్‌గా ఉన్న 27 సంవత్సరాల యువకుడి కుటుంబం ఆవయవదానం చేయడానికి ముందుకు రావడంతో గుండెమార్పిడి చేయడానికి అవకాశం ఏర్పడింది. అనంతరం హృదయ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ దుర్గాప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం గుండెమార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. దీంతో కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆత్మహత్య చేసుకోవాలని ట్యాంక్‌బండ్‌కు..

ఏఐతో సైబర్‌ మోసాలు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 24 , 2026 | 10:38 AM