ఏఐతో సైబర్ మోసాలు
ABN , Publish Date - Feb 24 , 2026 | 08:11 AM
ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు కేవలం డబ్బునే కాకుండా, వ్యక్తిత్వాన్ని దొంగిలిస్తున్నారని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బయోమెట్రిక్‌తో మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ వి.అరవింద్‌బాబు హెచ్చరించారు.
చిన్న టెక్నికల్ సహాయం అంటూ తమ మొబైల్ ద్వారా డేటా చోరీ
ఫేక్ వీడియోలు సృష్టించి దోపిడీ.. అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
ఫేక్ వీడియోలు సృష్టించి దోపిడీ.. అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ: ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు కేవలం డబ్బునే కాకుండా, వ్యక్తిత్వాన్ని దొంగిలిస్తున్నారని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బయోమెట్రిక్‌తో మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ వి.అరవింద్‌బాబు(Cyber Crimes DCP V. Aravind Babu) హెచ్చరించారు. దీనిపై ఆయన పలు విషయాలు వెల్లడించారు. ’మాల్స్, మెట్రో ేస్టషన్లు, మార్కెట్లు వంటి రద్దీ ప్రాంతాల్లో సైబర్ నేరగాళ్లు వృద్థులుగా, ఏమీ తెలియని మధ్యతరగతి వ్యక్తులుగా నటిస్తూ మోసం చేస్తున్నారు.
తమకు సాంకేతికత తెలియదని, పెన్షన్ స్టేటస్ చూడమని లేదా ఫోన్‌లోని ఏదైనా యాప్‌ను సరిచేయమని చిన్న సహాయం కోరుతారు. వారు బాధితులకు ఇచ్చే ఫోన్లో అప్పటికే వీడియో కాల్ లేదా స్ర్కీన్ రికార్డింగ్ ఆన్ చేసి ఉంటుంది. మీరు ఆ ఫోన్ వైపు చూడగానే మీ ముఖం, గొంతు రికార్డు అవుతాయి. కేవలం కొద్ది సెకన్లలోనే మీ బయోమెట్రిక్ డేటాను ేసకరించి, ఏఐ సాయంతో మీలాగే నటించే డీప్ ఫేక్ వీడియోలను, ఆడియోలను సృష్టిస్తారు. వాటి ఆధారంగా సైబర్ మోసాలకు పాల్పడుతారు’ అని తెలిపారు.
రక్షణ చిట్కాలు
అపరిచితుల మొబైల్ ఫోన్లను
ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకండి.
తెలియని వీడియో కాల్స్ వైపు చూడటం, గుర్తు తెలియని వ్యక్తులు చెప్పే సూచనలు పాటించడం మానుకోండి.
రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎవరైనా ఫోన్ చేతికి ఇచ్చి టెక్నికల్ సహాయం అని అడిగితే జాగ్రత్తగా ఉండండి.
అనుమానం వచ్చిన వెంటనే ఫిర్యాదు చేయండి. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లు భావిస్తే వెంటనే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయండి లేదా సైబర్‌క్రైమ్ డాట్ జీవోవీ.ఇన్‌లో ఫిర్యాదు చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి:
హైదరాబాద్‌లో చాలెట్ లగ్జరీ హోటల్
వ్యక్తిత్వ వికాస కేంద్రాలుగా జైళ్లు!
Read Latest Telangana News and National News