హైదరాబాద్‌లో చాలెట్ లగ్జరీ హోటల్
ABN , Publish Date - Feb 24 , 2026 | 06:17 AM
లెట్ హోటల్స్ లిమిటెడ్.. హైదరాబాద్‌లో 330 గదులతో లగ్జరీ హోటల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మాదాపూర్‌లో 36,255 చదరపు అడుగుల...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): చాలెట్ హోటల్స్ లిమిటెడ్.. హైదరాబాద్‌లో 330 గదులతో లగ్జరీ హోటల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మాదాపూర్‌లో 36,255 చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య, రిటైల్ స్పేస్‌తో దీన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. సుమారు రూ.632.80 కోట్ల పెట్టుబడితో ఈ హోటల్‌ను నెలకొల్పుతున్నట్లు పేర్కొంది. ఈ నిధులను పూర్తిగా అంతర్గత వనరులు, రుణాల రూపంలో సమకూర్చుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. 2028-29 ఆర్థిక సంవత్సరంలో ఈ హోటల్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. చాలెట్ హోటల్స్ ఇప్పటికే హైదరాబాద్‌లో ది వెస్టిన్ హైదరాబాద్ మైండ్‌స్పేస్, ది వెస్టిన్ హైదరాబాద్ హైటెక్ సిటీ పేరుతో రెండు హోటళ్లను నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి..
పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..