ఆత్మహత్య చేసుకోవాలని ట్యాంక్‌బండ్‌కు..
ABN , Publish Date - Feb 24 , 2026 | 08:44 AM
కుటుంబ సమస్యలతో విసిగిపోయు కుమారులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ మహిళను పోలీసులు కాపాడారు.
తల్లీకుమారులను కాపాడిన పోలీసులు
హైదరాబాద్: కుటుంబ సమస్యలతో విసిగిపోయు కుమారులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ మహిళను పోలీసులు కాపాడారు. జియాగూడ ఎంసీహెచ్ కాలనీకి చెందిన బి. ప్రతివ(28) తన ఇద్దరు కుమారులు అనిషి(10), జస్వంత్(7)తో కలిసి సోమవారం మధ్యాహ్నం ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఆమెను పోలీసులు ప్రశ్నించగా.. కుమారులతో కలిసి హుస్సేన్‌సాగర్(Hussain Sagar)లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని వచ్చినట్లు చెప్పింది.
తల్లీకుమారులను సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇన్‌స్పెక్టర్ ఎ. సీతయ్య ఆమెను అడిగి సమస్యలు తెలుసుకున్నాడు. ఇంట్లో భర్తతో గొడవలు జరుగుతున్నాయని, కుటుంబ సమస్యలతో విసిగిపోయానని చెప్పింది. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
హైదరాబాద్‌లో చాలెట్ లగ్జరీ హోటల్
వ్యక్తిత్వ వికాస కేంద్రాలుగా జైళ్లు!
Read Latest Telangana News and National News