చాడీలు చెబితే జరిమానా.. ఛత్తీస్‌గఢ్‌లోని ఈ ఊరి ప్రత్యేకత ఏంటో తెలుసా..
ABN , Publish Date - Feb 23 , 2026 | 08:53 PM
ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కలిస్తే అక్కడ లేని వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల మధ్య, బంధువుల మధ్య గొడవలకు చాడీలు చెప్పడం అనేది అనేక గొడవలకు కారణమవుతుంటుంది.
ఇద్దరు, ముగ్గురు కలిస్తే అక్కడ లేని మరో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల మధ్య, బంధువుల మధ్య గొడవలకు చాడీలు చెప్పడం అనేది అనేక గొడవలకు కారణమవుతుంటుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి గొడవలను నివారించేందుకు ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామ ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. చాడీలు చెప్పడాన్ని నిషేధించారు (Gossip ban India).
ఛతీస్‌గఢ్‌లోని మేఢకీ గ్రామ ప్రజలు చాడీలు చెప్పడాన్ని నిషేధించారు. ఈ నిబంధనను అతిక్రమించిన వారికి రూ.5 వేలు జరిమానా విధించాలని నిర్ణయించారు. గాలి కబుర్ల వల్ల స్నేహితుల మధ్య వివాదాలు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల మధ్య వివాదాలను రేకెత్తించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిని నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు (Chhattisgarh village rule).
ఈ గ్రామంలో ఇప్పటికే మద్యపాన నిషేధాన్ని ఐదేళ్లుగా అమలు చేస్తున్నారు (Village dispute solution). మద్యం అమ్మిన వారికి రూ.10 వేలు, తాగి గొడవ పడేవారికి రూ.11 వేలు జరిమానా విధిస్తున్నారు. అలాగే మద్యం అమ్ముతున్న వారి గురించి సమాచారం ఇస్తే వెయ్యి రూపాయలు బహుమతి ఇస్తున్నారు. తాజాగా చాడీలు చెప్పడాన్ని కూడా నిషేధించారు.
ఇవి కూడా చదవండి..
పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..
మీది హెచ్‌డీ చూపు అయితే.. ఈ ఫొటోలోని రెండో పిల్లి ఎక్కడుందో 7 సెకెన్లలో గుర్తించండి..