Share News

మామిడిచెట్లకు ట్యాంకర్లతో నీరు

ABN , Publish Date - Sep 08 , 2026 | 01:32 PM

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పొలాల్లోని బోర్లు ఎండిపోయాయి. ఆ బోర్లను నమ్ముకొని సాగు చేసిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు.

 మామిడిచెట్లకు ట్యాంకర్లతో నీరు
Mango Trees Water Crisis

తనకల్లు(అనంతపురం): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పొలాల్లోని బోర్లు ఎండిపోయాయి. ఆ బోర్లను నమ్ముకొని సాగు చేసిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు. మండలంలో పెద్దకడపలవారిపల్లికి చెందిన సూర్యనారాయణ తనకున్న 20 ఎకరాల్లో 1200 మామిడి చెట్లను 15 సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాడు.


mango1.jpgనేడు బోర్లు ఎండిపోవడంతో కన్నబిడ్డలా పెంచుకున్న మామిడి చెట్లు కళ్లముందే ఎండిపోతుంటే చూస్తూ భరించలేకపోయాడు. రోజుకు మూడు ట్యాంకర్ల నీటిని ఒక్కోదాన్ని రూ. 1500 చొప్పున కొనుగోలు చేసి.. మామిడి చెట్లకు నీరందిస్తూ.. వాటిని కాపాడుకొంటున్నాడు. తనలాగే చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని... ప్రభుత్వం తగిన సహకారం అందించాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అభివృద్ధితో ఓటు బ్యాంక్ పెంచుకుందాం

మెగా డీఎస్సీపై వైసీపీది తప్పుడు ప్రచారం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 01:32 PM