Share News

స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదు: మహేశ్ గౌడ్

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:31 PM

బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని మండలిలో తీర్మానం పెట్టామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మనువాద పార్టీ అంటూ వ్యాఖ్యానించారు.

స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదు: మహేశ్ గౌడ్
Mahesh Kumar Goud

హైదరాబాద్, సెప్టెంబర్ 8: బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని మండలిలో తీర్మానం పెట్టామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ మనువాద పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ లాంటి పార్టీ ప్రజలకి అవసరమే లేదని.. ఆ పార్టీ ఆలోచన విధానంలోనే దళిత వ్యతిరేకత ఉందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీయే అని అనేకసార్లు రుజువైందన్నారు.


భట్టి విక్రమార్క సీఎల్పీ నాయకుడైతే బీఆర్‌ఎస్ తట్టుకోలేకపోయిందని టీపీసీసీ చీఫ్ అన్నారు. గడ్డం ప్రసాద్ స్పీకర్ అయితే బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోందని విమర్శించారు. దళిత స్పీకర్‌ను అధ్యక్ష అని అనలేకనే కేసీఆర్ సభకి రావడం లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదన్నారు. స్వతంత్ర్య ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో దళితుల పాత్ర గొప్పదని అన్నారు. దళితులకు కాంగ్రెస్ పెద్దపీట వేసిందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

డ్యూటీలో ఉన్న పోలీసులను కొట్టిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి: మంత్రి సీతక్క

స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు: హరీశ్ రావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 12:36 PM