డ్యూటీలో ఉన్న పోలీసులను కొట్టిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి: మంత్రి సీతక్క
ABN , Publish Date - Sep 08 , 2026 | 11:11 AM
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి.. చేయలేదని అంటున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి.. తాము చేయలేదని అంటున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం) శాసనసభలో మాట్లాడుతూ.. మాజీ మంత్రిసబితా ఇంద్రారెడ్డిని తోసింది ఎవరని ప్రశ్నించారు. మహిళల ముందు హరీశ్ రావు బట్టలు విప్పుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సభ్యులను ముందు పెట్టుకుని రావాలని ఎందుకు చూశారని నిలదీశారు. ‘మహిళా ఎమ్మెల్యేలను సేఫ్టీ ప్లేస్‌లోకి పంపి.. ఆ తర్వాత మీరు రావాల్సింది’ అని అన్నారు.
మహిళా పోలీస్ ఆఫీసర్‌పై బీఆర్‌ఎస్ నేతలు చేయిచేసుకున్నారని.. వారిని తిట్టారని చెప్పారు. వీటికి సంబంధించి అన్ని విజువల్స్ ఉన్నాయన్నారు. డ్యూటీలో ఉన్న పోలీసులను కొట్టిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. శాసనసభ దేవాలయం లాంటిందన్నారు. బీఆర్‌ఎస్ మహిళా నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. హరీశ్ రావును ఏదో అంటే కవితను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారని మంత్రి సీతక్క ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
బీఆర్‌ఎస్ మహిళా నేతలపై దాడి చేయించింది రేవంత్ రెడ్డే: కేటీఆర్
‘నా తల్లిని అన్నారు.. ముందు నా సంగతేంటో చెప్పాలి’: స్పీకర్
Read Latest Telangana News And Telugu News