‘లొల్లిపెడితే భయపడను’.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ వార్నింగ్
ABN , Publish Date - Sep 08 , 2026 | 10:27 AM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు తీరుపై మండిపడ్డారు. ‘మీరు లొల్లిపెడితే నేను భయపడను. మీరు చేసేది తప్పు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై గౌరవం ఉందని తెలిపారు.
వారిపై జరిగిన ఘటన వివరాలు తెప్పించుకుంటున్నామని.. సీఎం ఈ ఘటనపై నివేదిక కోరారని మంత్రి వెల్లడించారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇష్టానుసారం చేస్తామనడం సరికాదన్నారు. స్పీకర్‌ను సభ్యులు అగౌరవపరిస్తే కనీసం స్పందించరా అని ప్రశ్నిస్తూ.. సభాపతిని బెదిరించడం పద్ధతి కాదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి: లక్ష్మణ్
ఒక దళిత స్పీకర్‌ను అవమానించారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. వారి తల్లిని అవమానించారని.. బీఆర్‌ఎస్‌కు మాట్లాడడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. కేటీఆర్ ఓ పోలీసు అధికారి గల్లా పట్టి కొట్టారని.. హరీశ్ రావు మహిళా అధికారుల ముందు షర్ట్ విప్పారని అన్నారు. ముందు స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
తిరుపతిలో మహిళపై దాడి.. మెడలో బంగారు గొలుసు చోరీ
గంజాయి మత్తులో పోలీసు వాహనాన్నే ఎత్తుకెళ్లిన యువకుడు
Read Latest Telangana News And Telugu News