Share News

తిరుపతిలో మహిళపై దాడి.. మెడలో బంగారు గొలుసు చోరీ

ABN , Publish Date - Sep 08 , 2026 | 09:01 AM

తిరుపతిలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ఆవులు మేపుతున్న ఓ మహిళపై దాడిచేసి, మెడలోని బంగారు గొలుసును కొందరు దుండగులు ఎత్తుకెళ్లారు.

తిరుపతిలో మహిళపై దాడి.. మెడలో బంగారు గొలుసు చోరీ

తిరుపతి, (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని రామచంద్రాపురం మండలంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. మండలంలోని గడ్డకిందపల్లి గ్రామానికి చెందిన కళావతి అనే మహిళ ఈ రోజు(మంగళవారం)ఉదయం తమ ఆవులను మేపడానికి గ్రామశివార్లకు వెళ్లారు. ఈ సమయంలో స్కూటీపైన వచ్చిన ఇద్దరు దుండగులు కళావతిపై దాడిచేసి, ఆమె మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు.


గమనించిన స్థానికులు కళావతిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం.. బాధితురాలు ఆర్‌సీపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఇలాంటి దొంగతనాలు జరగడం ఇది మొదటిసారి కాదని గ్రామస్థులు తెలిపారు. గత రెండు నెలల్లో నాలుగు చోరీలు జరిగాయని, అయినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తు్న్నారు.


సైబర్ వలలో చిక్కుకున్న టీటీడీ ఉద్యోగి

టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగి శ్రీనివాసన్‌ సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో చిక్కుకున్నారు. పీఎం ముద్రా యోజన కింద రూ.5 లక్షల లోన్ ఇస్తామని నమ్మించి.. బాధితుని నుంచి రూ.2.25 లక్షలు వసూలు చేశారు. మోసపోయానని గ్రహించిన శ్రీనివాసన్ అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా్ప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? కాంగ్రెస్ ఎంపీల ఆగ్రహం

అమరావతిని మారుస్తామనడం అవివేకం

For More AP News And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 09:01 AM