‘నా తల్లిని అన్నారు.. ముందు నా సంగతేంటో చెప్పాలి’: స్పీకర్
ABN , Publish Date - Sep 08 , 2026 | 10:38 AM
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు తీరుపై మండిపడ్డారు. ‘నా తల్లిని అన్నారు.. నాకు ఆగ్రహం ఉంటుంది. నీ తల్లిని అనలేదు. నీకెందుకు ఆగ్రహం’ అంటూ ఫైర్ అయ్యారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తన సోదరీమణులతో సమానమని తెలిపారు.
వారిపై దాడి జరిగిందని తెలియగానే నివేదిక కోరినట్లు స్పీకర్ చెప్పారు. నివేదిక వచ్చాక చర్యలు తప్పక తీసుకుంటామన్నారు. కానీ ముందు తన సంగతేంటో చెప్పాలని.. ‘నా తల్లిని అన్నారు.. హరీశ్ రావు ముందు దీనిపై మాట్లాడాలి’ అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సీరియస్ అయ్యారు.
అంతకుముందు హరీశ్ రావు మాట్లాడుతూ.. నిన్న అసెంబ్లీ గేటు వద్ద మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై దాడి జరిగిందని తెలిపారు. సబిత గొంతు నులిమారని, సునీత చీర లాగారని ఫైర్ అయ్యారు. దాడి జరిగిన వారిపైనే తిరిగి కేసులు నమోదు చేశారని.. తమకు న్యాయం చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. దీనిపైనే స్పీకర్ మాట్లాడుతూ.. హరీశ్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంత సీరియస్ అవుతున్నారని ప్రశ్నిస్తూ.. ‘నా తల్లిని అన్నారు.. నీ తల్లిని అనలేదు.. నాకు ఉంటుంది ఆగ్రహం’ అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్ అయ్యారు.
ఇవి కూడా చదవండి...
గంజాయి మత్తులో పోలీసు వాహనాన్నే ఎత్తుకెళ్లిన యువకుడు
బీఆర్‌ఎస్ మహిళా నేతలపై దాడి చేయించింది రేవంత్ రెడ్డే: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News