Share News

అసంఘటిత కార్మికులకు భరోసా

ABN , Publish Date - Sep 08 , 2026 | 10:55 AM

అసంఘటిత కార్మికులకు పింఛన్‌ అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రమ్‌ యోగి మాన్‌ధన్‌(పీఎంఎస్‌వై) పథకాన్ని ప్రవేశపెట్టింది.

అసంఘటిత కార్మికులకు భరోసా
PM Shram Yogi Mandhan Yojana

  • పీఎం శ్రమ్‌ యోగి మాన్‌ధన్‌ యోజన ద్వారా పింఛన్‌

  • 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 3 వేలు

చొప్పదండి(కరీంనగర్): అసంఘటిత కార్మికులకు పింఛన్‌ అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రమ్‌ యోగి మాన్‌ధన్‌(పీఎంఎస్‌వై) పథకాన్ని ప్రవేశపెట్టింది. 18 నుంచి 40 ఏళ్ల వరకు వయస్సు ఉన్న కార్మికులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. ప్రతీ నెల 60 రూపాయల నుంచి 200 వరకు వయస్సును బట్టి కార్మి కుడు చెల్లిస్తే అంతే మొత్తంతో కేంద్ర ప్రభుత్వం కాంట్రి బ్యూషన్‌ను జమ చేస్తుంది. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ.3 వేల పింఛన్‌ను కేంద్ర కార్మికశాఖ అదజేస్తుంది. ఒకవేళ కార్మికులు మరణి స్తే కుటుంబానికి 50 శాతం పింఛన్‌ అంటే నెలకు 1500 రూపా యలను చెల్లిస్తుంది. ఆదాయం నెలకు 15 వేల రూపాయలలోపు ఉండాలి. పీఎఫ్‌ చెల్లించే కార్మికులు ఈ పథకంలో చేరేందుకు అనర్హులు.


దరఖాస్తు ఇలా..

కార్మికుడు సీఎస్‌సీ(కామన్‌ సర్వీస్‌ సెంటర్‌) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా(సేవింగ్స్‌, జన్‌దన్‌) ద్వారా మొదటి నెల పింఛన్‌ సొమ్మును జమ చేయాలి. ప్రతీ నెల బ్యాంకు ఖాతాలోని నగదు నుంచి ప్రీమియం చెల్లింపులు జరుగుతాయి. శ్రమ్‌ యోగి మాన్‌ధన్‌ యోజన డిజిటల్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే నాటికి కార్మికుడి వయస్సు 18 ఏళ్లలోపు, 40కిపైగా ఉండరాదు.


pm1.2.jpgఅర్హులైన కార్మికులు

వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, రిక్షా కార్మికులు, భూమి లేని కూలీలు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, చర్మకారులు, ఇటుక బట్టీల కూలీలు, లెదర్‌ కార్మికులు, దోబీ కార్మికులతోపాటు ఇతర రంగాల కార్మికు లు అర్హులు. ఈ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించేం దుకు ఉద్దేశించిన పథకం ఇది.


pm.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

ఒకటే కార్డు.. మెట్రో, బస్సుల్లో రయ్‌ రయ్‌!

బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ పోలీస్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 10:55 AM