Share News

నేపాల్ బాలుడి కన్నీటి గాథ.. తిరిగిరాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు..

ABN , Publish Date - Sep 08 , 2026 | 10:15 AM

కాఠ్‌మాండూకు చెందిన భార్యాభర్తలు కమ్మి, ఫర్సంగ్ కూడా వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు. వారి ఒక్కగానొక్క కుమారుడు 12 ఏళ్ల ట్సెరింగ్‌కు ఈ విషయం తెలియదు.

నేపాల్ బాలుడి కన్నీటి గాథ.. తిరిగిరాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు..
Nepal flash floods

ఇంటర్‌నెట్ డెస్క్: నేపాల్‌లో వచ్చిన మెరుపు వరదల కారణంగా 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాఠ్‌మాండూకు చెందిన భార్యాభర్తలు కమ్మి, ఫర్సంగ్ కూడా వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు. వారి ఒక్కగానొక్క కుమారుడు 12 ఏళ్ల ట్సెరింగ్‌కు ఈ విషయం తెలియదు. అతడిని మేనత్త మింగ్మర్ డోల్మా తన ఇంటికి తీసుకెళ్లిపోయింది. బాలుడు తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తుండటంతో మేనత్త అతడికి అబద్ధం చెప్పింది.


తల్లిదండ్రులు అడవిలో ఎక్కడో చిక్కుకుపోయారని, వాళ్లు ఇంటికి తిరిగి రావాలంటే సంవత్సరం లేదా రెండు సంవత్సరాల సమయం పడుతుందని చెప్పింది. ఆ పిల్లాడు మేనత్త మాట నమ్మాడు. రక్త సంబంధీకులను పోగొట్టుకుని ఏడుస్తున్న పిల్లలను చూసి ట్సెరింగ్ కూడా ఏడుస్తున్నాడు. ఆ పిల్లలు ‘మీ అమ్మానాన్న ఎక్కడ’ అని అడిగినపుడు.. ‘వాళ్లు అడవిలోకి వెళ్లారు. వాళ్ల దగ్గరకు వెళ్లడానికి దారి లేదు’ అని చెబుతున్నాడు. మింగ్మర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అతడి తల్లిదండ్రులు ఈ లోకంలో లేరు. ఇప్పటికైతే ఈ విషయం ట్సెరింగ్‌కు తెలియదు. తల్లిదండ్రుల కోసం అతడు ఎదురుచూస్తున్నాడు’ అని తెలిపింది.


పోలీస్ అధికారుల ప్రకటన..

నేపాల్‌లో మెరుపు వరదల కారణంగా 4,898 మంది గల్లంతయ్యారని ఆ దేశ పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. వారి ఆచూకీ లభ్యమవుతుందన్న ఆశలు కూడా అడుగంటాయని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో శిథిలాల నుంచి 843 మృతదేహాలతోపాటు గుర్తుపట్టలేనంతగా విచ్ఛిన్నమైన 501 శరీర భాగాలు వెలికి తీసినట్లు పేర్కొన్నారు. మృతుల్లో 758 మంది పెద్దలు, 85 మంది చిన్నారులు ఉన్నారని వివరించారు.


ఇవి కూడా చదవండి

బీఆర్‌ఎస్ మహిళా నేతలపై దాడి చేయించింది రేవంత్ రెడ్డే: కేటీఆర్

రోహిత్, కోహ్లీ వన్డే ప్రపంచ కప్ ఆడతారని చెప్పడం తొందరపాటు: ఆశిష్ నెహ్రా

Updated Date - Sep 08 , 2026 | 10:15 AM