కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ట్రయల్‌రన్
ABN , Publish Date - Sep 08 , 2026 | 10:21 AM
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-563)పై వాహనాల ట్రయల్‌రన్ నడుస్తోంది.
ఆ మార్గంలో దూసుకుపోతున్న వాహనాలు
త్వరలో ప్రారంభోత్సవానికి ముహూర్తం.?
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-563)పై వాహనాల ట్రయల్‌రన్ నడుస్తోంది. కొత్తగా రూపుదిద్దుకున్న ఈ మార్గంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు రెండు మూడు రోజులుగా వాహనాలను అనుమతిస్తున్నారు. ఏవైనా లోటు పాట్లున్నాయా..? అని పరిశీలిస్తున్నారు. నాలుగు వరుసలుగా ఆధునాతన మార్గం సిద్ధమవడంతో జిల్లా ప్రజల్లో సంతోషం వ్యక్తమవు తోంది. 68 కిలోమీటర్ల పొడవున్న రహదారి విస్తరణకు భారత్ మాల పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పలుమార్లు ఈ రహదారి పనుల ప్రగతిపై సమీక్షలు నిర్వహించారు. 1,641 కోట్ల రూపా యల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
గతంలో వరంగల్ నుంచి కరీంనగర్‌కు ప్రయాణ సమయం గంట న్నర పట్టేది. ఇప్పుడు ఈ కొత్త మార్గం వల్ల 45 నిమిషాలే పట్టనుంది. ఇక దారిపై సోలార్ వెలుగులతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఏటీఎంఎస్)ను ఏర్పా టు చేయడంతోపాటు ఏ చిన్న ప్రమాదం జరిగినా క్షణాల్లో అక్కడికి చేరుకునే సరికొత్త వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రహదారిలో తొమ్మిది భారీ వంతెనలు, 23 చిన్నవంతెనల్ని నిర్మించారు. మానకొండూర్, శంకరపట్నం, హుజూరాబాద్ సమీపంలో బైపాస్ మార్గంలో ఈ జాతీయ రహదారిని ఏర్పాటు చేశారు. ఆధునిక వసతుల తో రూపుదిద్దుకున్న ఈ మార్గంపై వాహనాలు రయ్ రయ్‌మని దూసుకెళ్లే సమయం అతి త్వరలోనే రానుంది.
దసరాలోపు వినియోగించేలా..
అక్టోబరు మొదటి వారం నుంచి దసరాలోపు మంచి ముహుర్తాన్ని చూసి ఈ రోడ్డును ప్రారంభించేం దుకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తోపాటు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మార్గంతోపాటు మరికొన్ని చోట్ల పూర్తియిన జాతీయ రహదారులన్నింటిని కలిపి ఒకే రోజున జాతికి అంకింతం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్యక్ర మాన్ని నిర్వహించనున్నట్లు తెలిసిం ది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లే విధంగా ఈ రోడ్డుని నిర్మించారు.
ఏడాదిన్నర క్రితం పనులు ప్రారంభించారు. ఇప్పటికీ పలు గ్రామాల ప్రజలు తమకు అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలనే వినతులను అందిస్తున్నారు. ఇందులో కొన్నింటిని పరిశీలించిన అధికారులు ప్రజలు కోరిన సౌకర్యాల్ని కల్పించారు. మొదట్లో భూసేకరణ సహా టెండర్ల విషయంలో జాప్యం జరిగింది. తర్వాత అనూహ్యంగా పనుల్లో వేగం పెరిగింది. శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద ఇప్పటికే టోల్ ప్లాజా ను నిర్మించారు. రోడ్డు ప్రారంభం తర్వాత ఇక్కడ టోల్ రుసుమును వసూలు చేయనున్నారు. గతంలో గుంతలమయమై.. ప్రమాదాలకు అడ్డాగా మారిన రోడ్డు రూపు మారడంతో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఒకటే కార్డు.. మెట్రో, బస్సుల్లో రయ్ రయ్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News