Share News

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద హైటెన్షన్.. కాంగ్రెస్ శ్రేణుల ముట్టడి యత్నం

ABN , Publish Date - Sep 08 , 2026 | 01:07 PM

గజ్వేల్ నియోజకవర్గంలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు డప్పు చప్పుళ్లతో ఫాంహౌస్‌ ముట్టడికి యత్నించారు. దీంతో వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు.

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద హైటెన్షన్.. కాంగ్రెస్ శ్రేణుల ముట్టడి యత్నం
KCR farmhouse

సిద్దిపేట, సెప్టెంబర్ 8: గజ్వేల్ నియోజకవర్గంలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు డప్పు చప్పుళ్లతో ఫాంహౌస్‌ ముట్టడికి యత్నించారు. దీంతో వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎర్రవెల్లి ఫాంహౌస్ వద్ద వెయ్యి డప్పులతో చావు డప్పు కొడతామంటూ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కేసీఆర్ ఫాంహౌస్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చెక్‌పోస్ట్‌‌లు పెట్టి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఫాంహౌస్‌కు వస్తున్న కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు.


ఫాంహౌస్‌కు బయలుదేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

మరోవైపు ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బయలుదేరారు. అసెంబ్లీ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌ రావు ఆధ్వర్యంలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఫాంహౌస్‌కు పయనమయ్యారు. కేసీఆర్ చావును కోరుకుంటున్నామంటూ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు, ఫాంహౌస్‌కు వెళ్తోన్న పలువురు బీఆర్‌ఎస్ నేతలను బొల్లారం చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. ‘మా ఇంటికి మేము వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ’ ఫైర్ అయ్యారు. అటు కాంగ్రెస్ నేతలు, ఇటు బీఆర్‌ఎస్‌ నేతలు ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు చేరుకుంటున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.


ఇవి కూడా చదవండి...

డ్యూటీలో ఉన్న పోలీసులను కొట్టిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి: మంత్రి సీతక్క

స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు: హరీశ్ రావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 01:25 PM