Share News

విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలి: మంత్రి సవిత

ABN , Publish Date - Jun 14 , 2026 | 02:58 PM

విద్యతోనే పేదరికాన్ని అధిగమించొచ్చని ఏపీ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. కురుబలు విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని సూచించారు.

విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలి: మంత్రి సవిత
Minister Savitha

శ్రీ సత్యసాయి జిల్లా, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): విద్యతోనే పేదరికాన్ని అధిగమించొచ్చని ఏపీ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. కురుబలు విద్యతో పాటు అన్నిరంగాల్లోనూ రాణించాలని సూచించారు. తన తండ్రి పేరు మీద పేదల విద్యకు ప్రోత్సాహం అందజేస్తున్నామని వివరించారు. ఈరోజు(ఆదివారం) సత్యసాయి జిల్లాలో ఎస్ఆర్ఆర్ ట్రస్టు ద్వారా రాయలసీమ కురుబ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను మంత్రి సవిత అందజేశారు.


పదోతరగతిలో 580 మార్కులు సాధించిన 26మంది విద్యార్థులకు రూ.25 వేల చొప్పున రూ.6.50 లక్షల నగదు పురస్కారాలు అందజేశారు. ఇంటర్‌లో 950 మార్కులు సాధించిన 59 మంది విద్యార్థులకు రూ.50 వేల చొప్పున రూ.29.50 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని వెల్లడించారు. ఎస్ఆర్ఆర్ ట్రస్టు ద్వారా ప్రతి ఏడాది ప్రతిభ పురస్కారాలను అందజేస్తున్నామని చెప్పుకొచ్చారు. విద్యార్థులకు అత్యుత్తమ మార్కులతో పాటు నైతిక విలువలు ఎంతో ముఖ్యమని తెలిపారు. సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.


కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సౌకర్యాలు, నాణ్యమైన విద్య, అందజేస్తున్నామని మంత్రి సవిత వివరించారు. తల్లికి వందనం పథకంలో ఇచ్చే నిధులను తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. పదోతరగతి, ఇంటర్‌లో కార్పొరేట్ విద్యాసంస్థల కంటే ఎక్కువగా ప్రభుత్వ సంస్థల విద్యార్థులే అత్యుత్తమ ఫలితాలు సాధించారని ప్రస్తావించారు. త్వరలో గుడి కట్ల పూజారులకు గౌరవ వేతనాలు ఇస్తామని మంత్రి సవిత ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ అడ్డుకుంటోంది.. కొల్లు రవీంద్ర ధ్వజం

ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 14 , 2026 | 03:16 PM