Share News

విద్యార్థిని గోపిక కుడిచేయి శస్త్రచికిత్స సక్సెస్: మంత్రి సవిత

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:10 PM

అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్మాది దాడిలో గాయపడ్డ విద్యార్థిని గోపిక కోలుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి సవిత పేర్కొన్నారు. మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోపికను మంత్రి శుక్రవారం పరామర్శించారు.

విద్యార్థిని గోపిక కుడిచేయి శస్త్రచికిత్స సక్సెస్: మంత్రి సవిత
AP Minister Savita

అనంతపురం జిల్లా, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్మాది దాడిలో గాయపడ్డ విద్యార్థిని గోపిక కోలుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి సవిత (AP Minister Savita) పేర్కొన్నారు. మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోపికను మంత్రి ఈరోజు (శుక్రవారం) పరామర్శించారు. తనకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రత్యేకంగా కృషి చేసిన మంత్రి లోకేశ్‌కు గోపిక కృతజ్ఞతలు తెలిపారని అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి సవిత మాట్లాడారు. తనకు మెరుగైన వైద్యం అందుతోందని గోపిక సంతోషం వ్యక్తం చేసిందని తెలిపారు.


మంత్రి లోకేశ్.. గోపిక ఆరోగ్యం గురించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు

తనను కాపాడిన స్నేహితురాలు ఎలా ఉందని గోపిక అడిగారని మంత్రి చెప్పుకొచ్చారు. గోపిక కుడిచేయి శస్త్రచికిత్స చేశారని, ఆపరేషన్ సక్సెస్ అయిందని వైద్యులు చెప్పారని అన్నారు. మంత్రి లోకేశ్.. గోపికను సొంత బిడ్డలాగా భావించి నిరంతరం ఆమె ఆరోగ్యం గురించి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారులను ఆస్పత్రి వద్ద ఉంచి వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.


జగన్ నైజం ఏంటో ప్రజలకు బాగా తెలుసు..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయం చేయాల్సిన చోట చేయాలని మంత్రి సవిత హితవు పలికారు. జగన్ నైజం ఏంటో ప్రజలకు బాగా తెలుసు అని చెప్పారు. ప్రజలంతా నిందితుడిని హతమార్చాలని కోరుకుంటుంటే… వైసీపీ కాపాడాలని చూస్తోందని ధ్వజమెత్తారు. నిందితుడు హేమంత్‌ను కాపాడేందుకు న్యాయస్థానంలో పిల్ వేశారని చెప్పారు. చట్టం చేయాల్సిన పని చేస్తోందని.. పోలీసులపై అతను దాడి చేయడంతోనే కాల్పులు జరిపారని మంత్రి సవిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు కేసులపై హైకోర్టులో కీలక విచారణ

ప్రాణాలకు తెగించి పోలీసుల రెస్క్యూ ఆపరేషన్.. హోం మంత్రి అనిత ప్రశంసలు

కడప, పులివెందులలో జగన్ అరాచకాలు, దౌర్జన్యాలతో ఓటర్లను భయపెడుతున్నారు.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 06:26 PM