కర్బూజా సాగుతో రూ.10లక్షల ఆదాయం
ABN , Publish Date - Jul 22 , 2026 | 01:00 PM
అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని ఆర్.కొట్టాల గ్రామానికి చెందిన రైతు తిరుపాల్‌నాయుడు నాలుగు ఎకరాల్లో కర్భూజా పంటను సాగుచేశాడు.
నాలుగు ఎకరాల్లో పంట సాగు
70 రోజుల్లో 66 టన్నుల దిగుబడి
కిలో రూ. 15 లెక్కన వ్యాపారుల కొనుగోలు
రొద్దం(అనంతపురం): అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని ఆర్.కొట్టాల గ్రామానికి చెందిన రైతు తిరుపాల్‌నాయుడు నాలుగు ఎకరాల్లో కర్భూజా పంటను సాగుచేశాడు. దుక్కిదున్నడానికి విత్తనాలు, మల్చింగ్‌షీట్, కూలి ఖర్చులు, మందుల పిచికారి కోసం రూ.3.3లక్షలు ఖర్చుపెట్టాడు. గోల్డెన్‌గోరీ రకానికి చెందిన విత్తనాన్ని 26 ప్యాకెట్లు నాటాడు.
కేవలం 70రోజుల్లో పంట చేతికి వచ్చింది. ఇప్పటి వరకు 66టన్నుల దిగుబడి రాగా కిలో రూ.15చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. రూ.10లక్షల ఆదాయం వచ్చినట్లు తిరుపాల్‌నాయుడు తెలిపాడు. కేవలం 70రోజుల్లో రూ. పది లక్షలు ఆదాయం రావడంతో రైతు ఆనందానికి అవధులు లేకుండాపోయింది.
ఈ వార్తలు కూడా చదవండి:
తమ్మినేని సీతారాం భూ భాగోతాలపై విచారణ చేస్తున్నాం
‘పిల్లలను చదివించే ప్రతి తల్లికీ నా వందనం’
Read Latest AP News And Telangana News And International News And Telugu News