భారత్‌తో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించి జింబాబ్వే
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:32 PM
రేపటి నుంచి స్వదేశంలో భారత్, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ 15 మంది సభ్యులతో కూడిన జట్టును జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది.
స్పోర్ట్స్ డెస్క్: టి20 ప్రపంచ ఛాంపియన్ టీమిండియాతో త్వరలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం తమ స్క్వాడ్‌లో పలు కీలక మార్పులు చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ వెస్లీ మధేవెరే, పేసర్ న్యూమన్ నియామ్‌హురి తిరిగి జట్టులో చేరారు. అలానే యంగ్ వికెట్‌కీపర్ అండ్ బ్యాటర్ తఫాడ్జ్వా సిగాకు తొలిసారిగా టీ20 ఫార్మాట్‌లో అవకాశం లభించింది.
బంగ్లాదేశ్‌తో జరిగిన ఇటీవలి సిరీస్‌కు దూరమైన మధేవెరేతో పాటు, గాయం నుంచి కోలుకున్న నియామ్‌హురి జట్టుతో చేరడం ఆతిథ్య జట్టుకు పెద్ద ఊరట. ఇక నియామ్‌హురి స్థానంలో బంగ్లా సిరీస్‌లోకి వచ్చి ఆకట్టుకున్న తనాకా చివాంగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తషింగా ముసెకివాలను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు.
స్టార్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా సారథ్యంలోని జింబాబ్వే జట్టు జులై 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా టీమింయాతో తలపడనుంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో జింబాబ్వే అద్భుతాలు చేసింది. తొలుత ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను, ఆతర్వాత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మాత్రం 1-2 తేడాతో కోల్పోయింది. మొత్తంగా వన్డే సిరీస్ కొట్టి మంచి ఊపుమీదున్న జింబాబ్వే.. స్వదేశంలో ప్రపంచ ఛాంపియన్ భారత్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
జింబాబ్వే జట్టు:
సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, తనకా చివంగా, బెన్ కర్రాన్, బ్రాడ్ ఎవాన్స్, వెస్లీ మాధవెరె, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజారబానీ, డియోన్ మైయర్స్, రిచర్డ్ నగరావా, న్యూమాన్ న్యాంహురి, మిల్టన్ షుంబా, తఫాడ్జ్వా సిగా
ఇవి కూడా చదవండి:
అఫ్గానిస్థాన్ వన్డే కెప్టెన్ పదవికి హష్మతుల్లా షాహిది రాజీనామా
ఫిఫా అధ్యక్షుడు గియానికి ఐరాస చీఫ్ పదవి!