Share News

మగాళ్లైతే రండి రా.. మాల్యవంతంలో వైసీపీ నాయకుల కవ్వింపు

ABN , Publish Date - Nov 06 , 2026 | 09:44 AM

వైసీపీ నాయకుల కవ్వింపు చర్యలతో టీడీపీ నాయకులపై ఘర్షణకు దిగిన ఘటన మండలంలోని మాల్యవంతం, వెంకటగారిపల్లి గ్రామాల్లో జరిగింది.

మగాళ్లైతే రండి రా.. మాల్యవంతంలో వైసీపీ నాయకుల కవ్వింపు
Anantapur Poll Violence

  • వెంకటగారిపల్లిలో టీడీపీ కార్యకర్తలపై దాడి

  • నల్లచెరువులో పోలింగ్‌ కేంద్రంలోనే..

  • మలసముద్రంలో మాజీమంత్రి ఉష శ్రీచరణ్‌ హల్‌చల్‌

  • చిలమత్తూరులో పోలీసులతో దురుసు ప్రవర్తన

బత్తలపల్లి(అనంతపురం): వైసీపీ నాయకుల కవ్వింపు చర్యలతో టీడీపీ నాయకులపై ఘర్షణకు దిగిన ఘటన గురువారం సాయంత్రం మండలంలోని మాల్యవంతం, వెంకటగారిపల్లి గ్రామాల్లో జరిగింది. మాల్యవంతం గ్రామంలో పోలింగ్‌ ముగిసిన తరువాత టీడీపీ నాయకులు ఇళ్లకు వెళ్తుండగా బత్తలపల్లి రహదారిలో టీడీపీ నాయకులను చూసిన వెంకటగారిపల్లి వైసీపీ నాయకులు మగాళ్లైతే మా ఊరికి రండిరా అంటూ కేకలు వేస్తూ కవ్వింపు చర్యలకు దిగి రాళ్లతో రువ్వారు. దీంతో అక్కడే ఉన్న రాష్ట్ర ఫైనాన్స్‌ డైరెక్టర్‌ గోనుగుంట్ల విజయ్‌కుమార్‌ టీడీపీ కార్యకర్తలు ఎవరు ఆవేశపడవద్దని సర్దిచెప్పారు.


తర్వాత వెంకటగారిపల్లి చేరుకున్న వైసీపీనాయకులు గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు ప్రతాప్‌, నారాయణస్వామిలపై దాడి చేసి గాయపరిచారు. గాయపడిన వారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మండల కన్వీనర్‌ నారాయణరెడ్డి, నాయకులు జక్కంపూటి పురుషోత్తంచౌదరి, ముళ్లగూరి వెంకటేశ్‌, అమరా, సుబ్బరాయుడు ఆస్పత్రికివెళ్లి టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు. వైసీపీకి చెందిన నారాయణస్వామి, కిష్ట గాయపడటంతో ధర్మవరం ఆస్పత్రికి తరలించారు.


ycp1.3.jpgపోలింగ్‌ కేంద్రంలోనే దాడి

నల్లచెరువు: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ సందర్భగా నల్లచెరువు జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుం ది. ఓటు వేసేందుకు వచ్చిన ఒక మహిళకి సాయం చేయబోయిన యువకుడిపై పోలింగ్‌ కేంద్రంలోనే దాడి జరగడం ఈ ఉద్రిక్తతకు కారమైంది. స్థానిక సంస్థల పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఒక మహిళ జడ్పీ ఉన్నత పాఠశాల వద్దకు వచ్చారు. ఆమెకు పోలింగ్‌ బూత్‌ నంబర్‌ తెలియకపోవడంతో గందరగోళానికి గురయ్యారు. అక్కడే ఉన్న ఓ యువకుడు ఇది గమనించి ఆమెకు సహా యం చేయడానికి వచ్చాడు. ఆమె ఆధార్‌కార్డును తీసుకొని లోపల ఉన్న వైసీపీ ఏజెంట్‌ను కలిసి ఈమె బూత్‌ నంబర్‌ ఎక్కడుంది అని అడిగాడు.


ఆ యువకుడి ఐడీ కార్డు చూసిన ఆ ఏజెంట్‌ అతడు దొంగ ఓటు వేయడానికి వచ్చాడంటూ పోలింగ్‌ కేంద్రంలోనే అతడిపై దాడికి దిగాడు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ వర్గాల మ ధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. డీఎస్పీ శివనారాయణస్వామి వెం టనే పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అ దుపులోకి తెచ్చారు. పోలింగ్‌ కేంద్రంలో యువకుడిపై దాడికి పాల్పడిన వైసీపీ ఏజెంట్లు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వారిలో ఒక ప్రముఖ పత్రికకు చెందిన విలేకరి కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎన్నికల రోజు విషాదాలు

అదే విషం.. పదే పదే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 09:44 AM