అమ్మో.. ఏఐ ఖర్చులు.. మా వల్ల కావట్లేదు: ఎలాన్ మస్క్
ABN , Publish Date - Nov 02 , 2026 | 03:01 PM
గ్రోక్ చాట్‌బాట్ కారణంగా తమకు ఏఐ ఖర్చులు భారంగా మారాయని టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ బహిరంగంగా అంగీకరించారు.
ఇంటర్నెట్ డెస్క్: గ్రోక్ చాట్‌బాట్ కారణంగా తమకు ఏఐ ఖర్చులు భారంగా మారాయని టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ బహిరంగంగా అంగీకరించారు. గ్రోక్‌తో వచ్చే ఆదాయం కంటే నిర్వహణ ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఎక్స్ ప్రీమియం యూజర్లకు ఉద్దేశించిన రోజువారీ వాడకం పరిమితులు గతంలో పోలిస్తే మరింతగా తగ్గినట్టు అనిపిస్తోందన్న ఓ యూజర్ ప్రశ్నకు మస్క్ ఈ మేరకు స్పందించారు. పరిమితి పెంచాలని ఆ యూజర్ కోరితే మస్క్ మాత్రం ఏఐ ఖర్చుల భారం గురించి నిర్మొహమాటంగా చెప్పేశారు.
చాట్‌జీపీటీ లాంటీ జెనరేటివ్ ఏఐ నిర్వహణ ఖర్చులు చాలా ఎక్కువని ఇప్పటికే సంబంధిత నిపుణులు చెబుతున్నారు. చాట్‌బాట్ పని చేసేందుకు భారీ స్థాయిలో కంప్యూటింగ్ వనరులు అవసరం కావడంతో ఖర్చులు కూడా ఆ మేరకు పెరిగాయి. ప్రస్తుతం ఎక్స్‌లో పెయిడ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 8 లక్షలు. వీరి అవసరాలకు తగినట్టు ఏఐ నిర్వహణకు ఖర్చులు భారంగా మారాయి.
ఈ నేపథ్యంలో యూజర్ల ఏఐ వినియోగానికి సంబంధించిన నిబంధనలను కట్టుదిట్టం చేశామని మస్క్ చెప్పారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఎక్స్ ఖర్చులను తగ్గించుకుంటుందా? లేక సబ్‌స్క్రిప్షన్ ధరలను సవరిస్తుందా? అన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇటీవల ఏఐ పెట్టుబడులపై మదుపర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో గూగుల్ షేర్లు కూడా పతనమైన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
గూగుల్ నుంచి ఏఐ చిప్‌లు కొనుగోలు చేయనున్న ఓపెన్ ఏఐ
ఓటర్ డేటాను యాక్సెస్ చేసిన క్లాడ్ ఏఐ.. యూఎస్‌లో కలకలం