Share News

గూగుల్‌ నుంచి ఏఐ చిప్‌లు కొనుగోలు చేయనున్న ఓపెన్‌ ఏఐ

ABN , Publish Date - Oct 28 , 2026 | 10:54 AM

ఆల్ఫాబెట్ ఐఎన్‌‌సీ గూగుల్ నుంచి ఓపెన్ ఏఐ సంస్థ ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ చిప్‌లను కొనుగోలు చేయనుంది. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఏఐ మోడళ్ల నిర్వహణ కోసం అవసరమైన కంప్యూటింగ్‌ శక్తిని పెంచుకోవాలని ఓపెన్‌ ఏఐ భావిస్తోంది.

గూగుల్‌ నుంచి ఏఐ చిప్‌లు కొనుగోలు చేయనున్న ఓపెన్‌ ఏఐ

ఇంటర్నెట్ డెస్క్: ఆల్ఫాబెట్ ఐఎన్‌‌సీ గూగుల్ నుంచి ఓపెన్ ఏఐ సంస్థ ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ చిప్‌లను కొనుగోలు చేయనుంది. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఏఐ మోడళ్ల నిర్వహణ కోసం అవసరమైన కంప్యూటింగ్‌ శక్తిని పెంచుకోవాలని ఓపెన్‌ ఏఐ భావిస్తోంది. ఇందులో భాగంగా సొంతంగా తయారు చేసిన చిప్‌లను కూడా ఈ ఏడాది చివరి నుంచి వినియోగిస్తామని ఓపెన్ ఏఐ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం చాలా టెక్నాలజీ కంపెనీలు సొంతంగా ఏఐ చిప్‌లను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఎన్విడియాకు పోటీ ఇవ్వాలని ఆ కంపెనీలు లక్ష్యంగా చేసుకున్నాయి.


ఓపెన్‌ ఏఐ రూపొందిస్తున్న సొంత చిప్‌లకు ‘జలపెనో’ అని పేరు పెట్టారు. బ్రాడ్‌కామ్‌ సంస్థతో కలిసి ఆ చిప్‌లను ఓపెన్ ఏఐ అభివృద్ధి చేస్తోంది. గూగుల్‌లో పనిచేసిన నిపుణులు ఈ చిప్‌ల తయారీకి సహకరిస్తున్నారు. ఓపెన్‌ ఏఐలో చిప్‌ల తయారీ బృందానికి నేతృత్వం వహిస్తున్న రిచర్డ్‌ హో గతంలో గూగుల్‌ చిప్‌ల అభివృద్ధిలో పనిచేశారు. గూగుల్‌ పదేళ్ల క్రితమే టెన్సర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు (టీపీయూలు) అనే చిప్‌ల తయారీని ప్రారంభించింది. తొలుత తన సెర్చ్‌ ఇంజిన్‌ వేగాన్ని పెంచుకునేందుకు వాటిని ఉపయోగించింది. ఆ తర్వాత ఏఐ పనులకు కూడా ఇవి ఎంతో ఉపయోగకరంగా మారాయి. దీంతో ఎన్విడియా చిప్‌లకు ప్రత్యామ్నాయంగా టీపీయూలకు ప్రాధాన్యం పెరిగింది. కాగా.. ఒరాకిల్‌ కూడా మంగళవారం ఒక కీలక ప్రకటన చేసింది. తన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవల ద్వారా గూగుల్‌ టీపీయూలను వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని ఒరాకిల్ తెలిపింది.


ఈ వార్తలనూ చదవండి:

బిల్ గేట్స్ హెచ్చరిక.. మరో 20 ఏళ్లల్లో..

భారత్‌కు ముప్పు ఉంది: మైక్రోసాఫ్ట్ ఏఐ నిపుణుడు నికొలస్ బట్స్

Updated Date - Oct 28 , 2026 | 11:32 AM