Share News

ఓటర్ డేటాను యాక్సెస్ చేసిన క్లాడ్ ఏఐ.. యూఎస్‌లో కలకలం

ABN , Publish Date - Oct 26 , 2026 | 03:15 PM

శిక్షణ సమయంలో ఓ ఏఐ మోడల్ మనుషుల అనుమతి తీసుకోకుండానే జార్జియా రాష్ట్ర ఓటర్ డేటాను యాక్సెస్ చేయడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.

ఓటర్ డేటాను యాక్సెస్ చేసిన క్లాడ్ ఏఐ.. యూఎస్‌లో కలకలం
Anthropic Claude AI

ఇంటర్నెట్ డెస్క్: అపరిమిత సామర్థ్యాలు ఉన్న ఏఐని అర్థం చేసుకోవడం దాన్ని సృష్టించిన శాస్త్రవేత్తలకే సాధ్యం కావడం లేదు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకంగా మారిపోయిన ఏఐ ప్రస్తుతం టెక్ రంగ నిపుణులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. తాజాగా క్లాడ్ ఏఐ అలాంటి పనే చేసి జనాల్లో గుబులు రేపింది. శిక్షణ సమయంలో ఓ క్లాడ్ ఏఐ మోడల్ తనకు విధించిన పరిమితులను కాదని ఏకంగా జార్జియా రాష్ట్ర (యూఎస్) ప్రజల ఓటర్ డేటాను యాక్సెస్ చేసింది.


వాస్తవానికి ఈ ఓటర్ జాబితా అంతా బహిరంగంగానే అందుబాటులో ఉంటుంది. ఎవరైనా ఈ వివరాలను పొందేందుకు స్వల్ప మొత్తంలో ఫీజు చెల్లించాలి. కానీ క్లాడ్ ఏఐ మోడల్ మాత్రం ఈ పేవాల్‌ను దాటుకుని జాబితాలోకి చొరబడింది. మనుషుల అనుమతి లేకుండానే ఏఐ ఈ డేటాలోకి చొరబడటం యూఎస్‌లో కలకలానికి దారి తీసింది. గతంలో ఓసారి ఇలాంటి ఘటన జరిగిందని ఈ నెలలోనే ఆంథ్రోపిక్ తెలిపింది. ఫెడరల్ (కేంద్రం) ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే వెబ్‌సైట్‌ల్లోని పేవాల్‌ను దాటుకుని చొరబడ్డట్టు తెలిపింది.


క్లాడ్ ఏఐని రూపొందించిన ఆంథ్రోపిక్ సంస్థ ప్రతినిధి ఈ విషయంపై స్పందించారు. డబ్బు చెల్లిస్తే కానీ లభించని ఓటర్ డేటాను క్లాడ్ చేజిక్కించుకుందని అన్నారు. అయితే, ఓటర్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలోకి వెళ్లలేదని, ఓటింగ్ రికార్డులను యాక్సెస్ చేయలేదని భరోసా ఇచ్చారు. తమ మోడల్స్‌ కూడా కొన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లల్లోకి చొరబడ్డట్టు ఓపెన్ ఏఐ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఏఐ పనితీరు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నందున ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఏఐ పరిశోధనకులు కొంతకాలంగా హెచ్చరిస్తున్నారు. బ్రేకులు పడాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

బిల్ గేట్స్ హెచ్చరిక.. మరో 20 ఏళ్లల్లో..

భారత్‌కు ముప్పు ఉంది: మైక్రోసాఫ్ట్ ఏఐ నిపుణుడు నికొలస్ బట్స్

Updated Date - Oct 26 , 2026 | 03:33 PM