భారత్‌కు ముప్పు ఉంది: మైక్రోసాఫ్ట్ ఏఐ నిపుణుడు నికొలస్ బట్స్
ABN , Publish Date - Oct 23 , 2026 | 07:00 PM
ఏఐ ఆధారిత సైబర్ దాడులతో భారత్‌కు ముప్పు పొంచి ఉందనేది వాస్తవమని మైక్రోసాఫ్ట్ ఏఐ, సైబర్‌సెక్యూరిటీ పాలసీ డైరెక్టర్ నికొలస్ బట్స్ చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ ఆధారిత సైబర్ దాడులతో భారత్‌కు ముప్పు పొంచి ఉందనేది వాస్తవమని మైక్రోసాఫ్ట్ ఏఐ, సైబర్‌సెక్యూరిటీ పాలసీ డైరెక్టర్ నికొలస్ బట్స్ చెప్పారు. సైబర్ దాడులకు ప్రధాన టార్గెట్‌గా మారిన దేశాల్లో భారత్ ఏడో స్థానంలో ఉందని అన్నారు. ఆసియా దేశాల్లో మూడో స్థానంలో ఉందని చెప్పారు. ఏఐ ఆధారిత సైబర్ ముప్పు వాస్తవ రూపం దాల్చిందని కూడా ఆయన చెప్పారు.
ప్రపంచంలో సైబర్ ముప్పు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే అరుదైన అవకాశం తమకు ఉందని చెప్పారు. ప్రతి రోజూ తాము 165 ట్రిలియన్ల సెక్యూరిటీ సంబంధిత టెలీమెట్రీ సిగ్నల్స్‌ను పరిశీలిస్తామని చెప్పారు. సైబర్ ముప్పు తప్పించేందుకు రోజూ 5 బిలియన్ ఈమెయిల్స్‌ను చెక్ చేస్తామని తెలిపారు. ఈ చర్యల ద్వారా రోజూ సుమారు 5 మిలియన్ మాల్‌వేర్ దాడులను అడ్డుకుంటామని వివరించారు. ఈ నేపథ్యంలో భారత్‌కూ ముప్పు పొంచి ఉన్న మాట వాస్తవమేనని అన్నారు.
సైబర్ నేరగాళ్లు ఇప్పటికే ఏఐ సాంకేతికతలను వాడుతున్నారని కూడా ఆయన చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వాలు, సంస్థల ముందు పలు సవాళ్లు ఉన్నాయని అన్నారు. కాబట్టి సైబర్ ముప్పును నివారించేందుకు మరిన్ని పటిష్ఠ చర్యలు అవసరమని పేర్కొన్నారు. నిపుణులు చెప్పే దాని ప్రకారం, ప్రస్తుతం సైబర్ దాడులకు ఈమెయిల్ ప్రధాన సాధనంగా కొనసాగుతోంది. దీంతో, పాటు ఫిషింగ్ నుంచి కూడా ముప్పు పొంచి ఉంది. ఈ సమయంలో సైబర్ భద్రతా టీమ్స్‌కు డేటా ప్రధాన రక్షణ సాధనంగా మారిందని కూడా నిపుణులు చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వచ్చే ఏడాది జనవరి నుంచీ సిమ్ బైండింగ్ అమలు.. ఫోన్‌లో సిమ్ లేకపోతే..