ఎస్‌బీఐపై సైబర్ దాడి!
ABN , Publish Date - Oct 21 , 2026 | 11:51 AM
తమపై సైబర్ దాడి జరిగిందని ఎస్‌బీఐ వెల్లడించింది. ఈ విషయాలను స్టాక్ ఎక్సేంజ్‌కు సమర్పించిన వివరాల్లో ఎస్‌బీఐ వెల్లడించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: తమపై సైబర్ దాడి జరిగిందని ఎస్‌బీఐ వెల్లడించింది. ఈ విషయాలను స్టాక్ ఎక్సేంజ్‌కు సమర్పించిన వివరాల్లో ఎస్‌బీఐ పేర్కొన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 3,897 మంది కస్టమర్ల రికార్డులు డార్క్ వెబ్‌లోకి చేరి ఉండవచ్చని ఎస్‌బీఐ పేర్కొంది. అయితే, ఈ దాడితో తమ కోర్ బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఫైనాన్షియల్ పనితీరు, వ్యాపార కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదని కూడా పేర్కొంది.
కస్టమర్ల డేటా బయటకు చేరి ఉండవచ్చని ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీమ్ (CERT - In) నుంచి సమాచారం అందిందని ఎస్‌బీఐ పేర్కొంది. డార్క్ వెబ్‌లో కనిపించిన 3,75,000 రికార్డుల్లో తమ కస్టమర్లకు చెందిన 3,897 రికార్డులు ఉన్నట్టు ప్రాథమిక విశ్లేషణలో తేలిందని ఎస్‌బీఐ పేర్కొంది. కస్టమర్‌ల డేట్ ఆఫ్ బర్త్, పేర్లు, ఈమెయిల్ అడ్రస్‌లు, ఇంటి అడ్రస్‌లు వంటివి ఉన్నాయని పేర్కొంది. బ్యాంకు బ్రాంచ్, కస్టమర్ ఫైల్ ఐడెంటిఫయ్యర్‌లు, లోన్‌లు, లీడ్ రికార్డులకు సంబంధించిన మెటా డేటా, సంబంధిత ఫైల్స్ కూడా ఉన్నాయని ఎస్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
3.75 లక్షల మంది భారతీయ కస్టమర్ల డేటా డార్క్ వెబ్‌లోకి చేరినట్టు గతంలో జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తమకు ఈ డేటా లభించిందని Siriusim అనే అజ్ఞాత హ్యాకర్ గ్రూపు పేర్కొన్నట్టు గతంలో జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇక, తమ కస్టమర్లకు చెందిన 1టీబీ డేటా బయటకుపొక్కిందని జులైలో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వెల్లడించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఎగిరే కారు శాంపిల్ మాత్రమే.. ఎలాన్ మస్క్ ఏం ప్లాన్ చేశారంటే..?
టెస్లా రోడ్‌స్టర్ కారు గాల్లో ఎగరడం వెనుక అసలు రహస్యం ఏంటి?