టెస్లా రోడ్‌స్టర్ కారు గాల్లో ఎగరడం వెనుక అసలు రహస్యం ఏంటి?
ABN , Publish Date - Oct 16 , 2026 | 08:12 PM
ఎలాన్ మస్క్‌కు చెందిన సరికొత్త టెస్లా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ సూపర్ కార్ కేవలం రోడ్డుపైనే కాకుండా, గాల్లోకి లేచి, తిరిగి సురక్షితంగా ల్యాండ్ అయి ప్రపంజాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ కారు గాల్లో చక్కర్లు కొట్టడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి?
Tesla Roadster Flying Technology: ఎలాన్ మస్క్‌కు చెందిన సరికొత్త టెస్లా రోడ్‌స్టర్ (Tesla Roadster) ఎలక్ట్రిక్ సూపర్ కార్ కేవలం రోడ్డుపైనే కాకుండా, గాల్లోకి లేచి, తిరిగి సురక్షితంగా ల్యాండ్ అయి ప్రపంజాన్ని ఆశ్చర్యపరిచింది. స్పేస్ఎక్స్ (SpaceX) రాకెట్ సాంకేతికతను పోలిన రాకెట్-స్టైల్ థ్రస్టర్ల సహాయంతో ఈ కారు గాల్లోకి లేవడం, రొటేట్ అవవడం వంటి విన్యాసాలు చేసింది. అయితే దీని వెనుక ఉన్న అసలు సాంకేతికత రాకెట్ ఇంధన దహనం కాదు.. దీనికి అసలు రహస్యం సంపీడన గాలి (Compressed Air), హై-ప్రెషర్ గ్యాస్, న్యూటన్ మూడవ చలన సూత్రం ఆధారంగా ఇది పనిచేస్తుందని సమాచారం.
టెస్లా థ్రస్టర్లు ఎలా పనిచేస్తాయి?
కోల్డ్-గ్యాస్ థ్రస్టర్లు (Cold-Gas Thrusters)
ఈ రోడ్‌స్టర్ రాకెట్ కాన్ఫిగరేషన్‌లో కారు చుట్టూ అమర్చిన వివిధ నాజిల్‌ల ద్వారా హై-ప్రెషర్ గ్యాస్‌ను బయటికి వదులుతారు. ఇందులో ఎలాంటి రాకెట్ ఇంధనం మండదు. దీనివల్ల వేడి ఎగ్జాస్ట్ గ్యాస్ రాదు. బదులుగా, ముందే ఒత్తిడితో నిల్వ చేసిన గ్యాస్ శక్తిని ఉపయోగిస్తారు.
250 కిలోల కంప్రెస్డ్ ఎయిర్
నివేదికల ప్రకారం, ఈ కారులో సుమారు 250-260 కిలోల కంప్రెస్డ్ గాలిని ప్రత్యేక ప్రెషర్ వెసెల్స్‌లో నిల్వ చేస్తారు. దాదాపు 10 నాజిల్‌ల ద్వారా ఈ గాలిని నియంత్రిస్తారు.
న్యూటన్ మూడవ చలన సూత్రం
వాల్వ్ తెరుచుకోగానే, అధిక పీడనంతో ఉన్న గ్యాస్ అత్యంత వేగంగా నాజిల్ గుండా బయటకు దూసుకెళ్తుంది. దీనికి వ్యతిరేక దిశలో ఏర్పడే బలంతో కారు ముందుకు లేదా పైకి నెట్టబడుతుంది.
కారు నిజంగా గాల్లోకి ఎలా ఎగరగలదు?
భూమి గురుత్వాకర్షణ శక్తిని అధిగమించడమే ఇక్కడ ప్రధాన సూత్రం. కారును పైకి లేపడానికి పై వైపునకు పనిచేసే థ్రస్ట్ బలం.. కారు బరువు కంటే ఎక్కువగా ఉండాలి. ఈ థ్రస్టర్లు ప్రధానంగా మూడు విధులను నిర్వర్తిస్తాయి.
1. లిఫ్ట్ థ్రస్ట్‌ను కిందికి మళ్లించడం ద్వారా కారు పైకి లేస్తుంది.
2.ఆటిట్యూడ్ కంట్రోల్: గాల్లో ఉన్నప్పుడు కారు కోణాన్ని సరిచేయడానికి ఇవి సహాయపడతాయి.
3. స్టెబిలైజేషన్, ల్యాండింగ్: జాగ్రత్తగా నియంత్రించిన గ్యాస్ బర్స్ట్ల ద్వారా కారు సురక్షితంగా కిందికి దిగేలా నియంత్రిస్తారు.
సాంప్రదాయ రాకెట్ ఇంజిన్లకు దీనికి తేడా ఏమిటంటే..
సాంప్రదాయ రాకెట్లు ఇంధనాన్ని, ఆక్సిడైజర్‌ను మండించి వేడి వాయువులను ఉత్పత్తి చేస్తాయి. కానీ ఈ కోల్డ్-గ్యాస్ థ్రస్టర్లలో మండించే ప్రక్రియ ఉండదు. అయితే ఇక్కడ ప్రధాన పరిమితి ఏమిటంటే, నిల్వ ఉంచిన గ్యాస్ అయిపోయే వరకు మాత్రమే ఇది పనిచేస్తుంది.
ఇది నిజానికి ఎగిరే కారు కాకపోయినా, అంతరిక్ష నౌకల టెక్నాలజీని భూమిపై నడిచే కారుకు ఎలా అన్వయించవచ్చో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ప్రయోగం. టెస్లా ఈ కారును 2028 నాటికి ఉత్పత్తిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ ప్రమేయం లేకుండా రిజర్వేషన్లు.. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం: మంత్రి నారాయణ
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దిక్కుతోచని స్థితిలో గొడ్డలి పార్టీ: మంత్రి కొల్లు రవీంద్ర
ఏపీకి భారీగా పెట్టుబడులు.. త్వరలో మూడు ప్రాంతాల్లో సదస్సులు
Read Latest AP News And Telangana News And National News