Share News

మరో అద్భుతానికి సిద్ధమైన మస్క్

ABN , Publish Date - Oct 21 , 2026 | 01:29 PM

స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో అద్భుతానికి సిద్ధమయ్యారు. వచ్చే నెలలో నిర్వహించనున్న ప్రయోగంలో భాగంగా స్టార్‌షిప్‌ను ‘చాప్‌స్టిక్స్‌’తో సేఫ్‌గా కిందకు దించనున్నట్టు చెప్పారు.

మరో అద్భుతానికి సిద్ధమైన మస్క్
Elon Musk Starship 15th flight

ఇంటర్నెట్ డెస్క్: స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో అద్భుతానికి సిద్ధమయ్యారు. వచ్చే నెలలో నిర్వహించనున్న ప్రయోగంలో భాగంగా స్టార్‌షిప్‌ను ‘చాప్‌స్టిక్స్‌’తో సేఫ్‌గా కిందకు దించనున్నట్టు చెప్పారు. పునర్వినియోగ రాకెట్స్ అభివృద్ధిలో భాగంగా స్పేఎక్స్ ఈ టెక్నాలజీని రూపొందించింది. శాటిలైట్ ప్రయోగాల అనంతరం రాకెట్స్‌ను, బూస్టర్స్‌ను సముద్రంలో కూల్చే బదులు మళ్లీ ప్రయోగకేంద్రం వద్ద జాగ్రత్తగా ల్యాండయ్యేలా చేస్తారు. తదుపరి ప్రయోగంలో ప్రయోగటవర్‌పై అమర్చిన ప్రత్యేక హ్యండిల్స్‌తో స్టార్‌షిప్‌ను సేఫ్‌గా ల్యాండ్ చేస్తారు. మస్క్ వీటిని గతంలో చాప్‌స్టిక్స్ అంటూ సరదాగా సంబోధించారు.


గతంలో స్పేస్‌ఎక్స్ ఇలాగే సూపర్ హెవీ బూస్టర్‌లు (రాకెట్ ప్రయోగంలో తొలి దశ) కిందకు దిగుతుండగా వాటిని ఒడిసిపట్టింది. తద్వారా రాకెట్ పునర్వినియోగ టెక్నాలజీ అభివృద్ధిలో కీలక ముందడుగు వేసింది. ఈసారి ప్రయోగంలో కిందకు వచ్చే రాకెట్ మొత్తాన్ని జాగ్రత్తగా మళ్లీ ప్రయోగ కేంద్రం వద్ద దించాలని ప్లాన్ చేస్తోంది. ఈ సాంకేతికత పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే అంతరిక్ష ప్రయోగాల ఖర్చు గణనీయంగా తగ్గిపోతుందని స్పేఎక్స్ చెబుతోంది. బూస్టర్‌తో పాటు రాకెట్‌ను కూడా ఇలా రికవర్ చేయగలిగితే అంతరిక్ష యాత్రలు ఊహించనంత సులువు అయిపోతాయని చెబుతోంది.


ఈ విషయాలపై తాజాగా ఎలాన్ మస్క్ స్పందిస్తూ వచ్చే ఏడాది నుంచి స్టార్‌షిప్‌తో వారానికో అంతరిక్ష యాత్ర చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. ఏడాది చివరి నాటికల్లా వారానికి రెండు అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించే స్థాయికి చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎగిరే కారు శాంపిల్ మాత్రమే.. ఎలాన్ మస్క్ ఏం ప్లాన్ చేశారంటే..?

టెస్లా రోడ్‌స్టర్ కారు గాల్లో ఎగరడం వెనుక అసలు రహస్యం ఏంటి?

Updated Date - Oct 21 , 2026 | 01:38 PM