Share News

డాక్టర్‌‌ను ఇంటికి పిలిచి చితకబాది 3.5 లక్షల దోపిడీ.. ఇద్దరు నటుల అరెస్టు

ABN , Publish Date - Nov 06 , 2026 | 08:29 AM

ఎమర్జెన్సీ పేరుతో డాక్టర్‌ను ఇంటికి పిలిచారు. తర్వాత ఆయనను చితకబాది మొబైల్ ఫోన్‌తో పాటు రూ.3.5 లక్షలు దోచుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు నటులు ఉన్నారు.

డాక్టర్‌‌ను ఇంటికి పిలిచి చితకబాది 3.5 లక్షల దోపిడీ.. ఇద్దరు నటుల అరెస్టు

ఇంటర్నెట్ డెస్క్: ఎమర్జెన్సీ పేరుతో డాక్టర్‌ను ఇంటికి పిలిచారు. తర్వాత ఆయనను చితకబాది మొబైల్ ఫోన్‌తో పాటు రూ.3.5 లక్షలు దోచుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు నటులు ఉన్నారు. కేరళలోని కోచిలో ఈనెల 2న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు యాక్టర్ అతుల్య చంద్ర, యాక్టర్ - ప్రొడ్యూసర్ బిబిన్ పెరుంబిలి, మరికొందరు ఓ డాక్టర్‌కు ఫోన్ చేసి ఒకరికి ఆరోగ్యం బాగా లేదని, ఎమర్జెన్సీ ఉందన్నారు. వెంటనే ఒక అపార్ట్‌మెంట్‌కు రావాలని చెప్పారు.


డాక్టర్ కాసేపట్లో ఆ ఫ్లాట్‌కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ 12 మంది ఉన్నారు. పెరుంబిలితో పాటు మిగతా వారు ఆయనపై దాడి చేశారు. తర్వాత డాక్టర్‌ను ఒక కుర్చీపై కూర్చోబెట్టి కడుపు, పక్కటెముకలపై కొట్టారు. అతుల్య చంద్ర ఆ డాక్టర్ ఫోన్, స్మార్ట్ వాచ్, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లను లాక్కుంది. ‘నువ్వు (డాక్టర్) దొంగవి. నిన్ను చంపేస్తాం. మా బంధువుల్లో ఒకరిని రేప్ చేశావు. అంతేకాకుండా మాపైనే కేసు పెడతానని బెదిరించావు’ అని ఆ డాక్టర్‌ను ఆమె బెదిరించింది. తర్వాత ఎలాగోలా బాధితుడు అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గాలిస్తున్నారు. ఈ దాడి వెనుక దోపిడీ కాకుండా ఇంకా వేరే ఏదైనా ఉద్దేశం అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దీపావళి వేళ రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్..

అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే డెడ్‌లైన్ మొదలు.. సుప్రీం కోర్టు స్పష్టత

Updated Date - Nov 06 , 2026 | 08:29 AM