Share News

దీపావళి వేళ రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్..

ABN , Publish Date - Nov 05 , 2026 | 08:31 PM

దీపావళి పండుగ వేళ రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పన్నుల పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు నవంబర్ నెలకు సంబంధించిన పన్నుల వాటా కింద రూ.1,09,019 కోట్లను విడుదల చేసింది.

దీపావళి వేళ రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్..

న్యూఢిల్లీ, నవంబర్ 5: దీపావళి పండుగ వేళ రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పన్నుల పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు నవంబర్ నెలకు సంబంధించిన పన్నుల వాటా కింద రూ.1,09,019 కోట్లను విడుదల చేసింది. వాస్తవానికి ఈ నిధులను నవంబర్ 10న విడుదల చేయాల్సి ఉండగా.. ఐదు రోజుల ముందుగానే అంటే నవంబర్ 5న రాష్ట్రాల ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.


పన్నుల వాటా నిధుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.19,208 కోట్లు కేటాయించారు. బిహార్‌కు రూ.10,845 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.8,010 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.7,866 కోట్లు, మహారాష్ట్రకు రూ.7,022 కోట్లు, రాజస్థాన్‌కు రూ.6,460 కోట్లు కేటాయించారు. అత్యల్పంగా సిక్కింకు రూ.365 కోట్లు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.

అక్టోబర్ 31న కూడా కేంద్ర ప్రభుత్వం.. అదనపు పన్నుల వాటా కింద మరో రూ.1,09,019 కోట్లను విడుదల చేసింది. దీంతో కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే రాష్ట్రాలకు మొత్తం రూ.2,18,038 కోట్ల నిధులు అందాయి. ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో ఇది రెండో అదనపు పన్నుల వాటా విడుదల.


కేంద్ర పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు 41 శాతం వాటా లభిస్తుంది. ఆ మొత్తాన్ని ఆర్థిక సంవత్సరంలో 14 విడతలుగా రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేస్తుంది. ముందస్తుగా నిధులు విడుదల చేయడం ద్వారా రాష్ట్రాలు మూలధన వ్యయాలను పెంచడంతోపాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు వినియోగించుకునే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇకపోతే 2026-27 కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాల పన్నుల వాటా కింద రూ.15.26 లక్షల కోట్లను కేటాయించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల్లో ఈ మొత్తం రూ.13.93 లక్షల కోట్లుగా ఉంది.


Also Read:

అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే డెడ్‌లైన్ మొదలు.. సుప్రీం కోర్టు స్పష్టత

రాహుల్ మద్యం వ్యాఖ్యలు.. ‘పప్పు’ అంటూ ఆప్ కౌంటర్

Updated Date - Nov 05 , 2026 | 08:34 PM