Share News

అదే విషం.. పదే పదే

ABN , Publish Date - Nov 06 , 2026 | 07:05 AM

వర్షం వస్తే కప్పలు బెక బెక మన్నట్లు, వైసీపీ కూడా అమరావతిపై కారుకూతలు కూయడానికి సిద్ధమవుతుందని రాజధాని ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు.

అదే విషం.. పదే పదే

  • అమరావతిపై మళ్లీ వైసీపీ దుష్ప్రచారం

గుంటూరు(రాజధాని)/తుళ్లూరు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): వర్షం వస్తే కప్పలు బెక బెక మన్నట్లు, వైసీపీ కూడా అమరావతిపై కారుకూతలు కూయడానికి సిద్ధమవుతుందని రాజధాని ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. అర్నబ్‌, మురసు తుఫాన్‌లతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయని, కానీ అమరావతిలో ఎక్కడా నిలిచిలేదని చెప్పారు. రాజధాని పనులు చేస్తున్న ప్రదేశంలో వర్షపు నీరు నిలబడితే అమరావతిని వరద చుట్టుముట్టిందని జగన్‌ రోతపత్రిక విషపు రాతలు రాస్తోందని, వైసీపీ మూకలు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిపై విష ప్రచారం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైనా ఆ పార్టీ వాళ్లకి బుద్ధి రాలేదని, స్థానిక ఎన్నికల్లో ఘోర పరాభవం మూటకట్టుకున్నా కూడా తెలుసుకోవటం లేదన్నారు. అమరావతి మీద పదేపదే విషం చిమ్మితే జగన్‌ పార్టీ జీరో సీట్లకే పరిమితంకావడం ఖాయమన్నారు.

పనులు చేసే ప్రదేశంలో నీరు నిలవదా?

రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నా జగన్‌ బ్యాచ్‌ విషం చిమ్ముతోంది. రోడ్లు వేసేటప్పుడు, కేబుల్‌ డెక్‌లు కట్టేటప్పుడు భూమిని తవ్వాల్సి వస్తుంది. అక్కడ వర్షపు నీరు నిలబడితే అమరావతిని వరద చుట్టముట్టిందని, దారేదని అసత్య ప్రచారాలు నీలి, కూలి మీడియాలో చేయటం హేయమైన చర్య.

- మైనేని గిరిజ, మహిళా రైతు (దొండపాడు)


చెక్కు చెదరని అమరావతి

రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన రెండు అతిపెద్ద తుఫానుల తరువాత కూడా రాజధాని పనులు సాఫీగా సాగుతున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో స్పష్టమైంది. గురువారం రాజధాని అమరావతిలో ఉన్న పరిస్థితిని సజీవ సాక్ష్యాధారాలతో ప్రజల ముందుకు తెచ్చింది. అమరావతి మునిగిపోయిందంటూ విషం ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టమైంది. ఐకానిక్‌ టవర్ల వద్ద చుక్క నీరు నిలవలేదు. కార్యదర్శుల భవనాల వద్ద, ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద, జడ్జిల విల్లాల వద్ద, ఎక్కాడా వర్షపు నీటి జాడ లేదు. నేలపాడులోని హైకోర్టులో కార్యకలాపాలు బుధ, గురువారాల్లో యథావిధిగా జరిగాయి.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 07:05 AM