శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ సజీవదహనం
ABN , Publish Date - May 25 , 2026 | 06:56 AM
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలేకమ్మ గుడి సమీపంలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లా, మే 25 (ఆంధ్రజ్యోతి): శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలేకమ్మ గుడి సమీపంలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గోధుమల లారీలో అకస్మాత్తుగా మంటలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోధుమల లోడుతో వెళ్తున్న లారీ మరో లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే గోధుమల లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో డ్రైవర్ బయటకు రావడానికి అవకాశం లేకపోయింది. దీంతో డ్రైవర్ లారీలోనే సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదంలో గోధుమల లోడుతో ఉన్న లారీ పూర్తిగా దగ్ధమైంది. మృతుడిని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కిరణ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. డ్రైవర్ మృతి చెందడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రక్తచరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసు.. జగన్ అండ్ కోపై మంత్రి నారాయణ ధ్వజం
కూటమి ప్రభుత్వంలో పేదల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నాం: మంత్రి అనగాని
Read Latest AP News And Telangana News And International News And Telugu News