Share News

Supreme Court on Tribal Case: ఆ 23 గ్రామాలను షెడ్యూల్ ట్రైబల్‌గా పరిగణించొద్దు.. సుప్రీం ఉత్తర్వులు

ABN , Publish Date - Sep 23 , 2025 | 05:43 PM

సుప్రీంకోర్టులో ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాల ట్రైబల్ కేసుపై మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసుపై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది.

Supreme Court  on Tribal Case: ఆ 23 గ్రామాలను షెడ్యూల్ ట్రైబల్‌గా పరిగణించొద్దు.. సుప్రీం ఉత్తర్వులు
Supreme Court on Tribal Case

ఢిల్లీ , సెప్టెంబరు23 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు (Supreme Court)లో ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాల ట్రైబల్ కేసుపై (Mangapeta Mandal villages Tribal Case) ఇవాళ(మంగళవారం) విచారణ జరిగింది. ఈ కేసుపై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. ములుగు మండలంలోని 23 గ్రామాలను షెడ్యూల్ ట్రైబల్ గ్రామాలుగా పరిగణించొద్దంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మంగపేటలోని 23 గ్రామాలను షెడ్యూల్ ట్రైబ్ గ్రామాలుగా పరిగణించవద్దంటూ సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ పిటిషన్ దాఖలు చేశారు.


ఆ గ్రామాలను ట్రైబల్ గ్రామాలుగా గతంలో తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court) ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో పరమాత్మ, పూజారి సమ్మయ్యలు సవాల్ చేశారు. 1950లో రాష్ట్రపతి ఇచ్చిన షెడ్యూల్ ట్రైబ్ ఆర్డర్‌లో మంగపేట మండలంలోని 23 గ్రామాలు లేవని 2013లో హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. అయితే, నిజాం ఆర్డర్ ఆధారంగా ట్రైబల్ గ్రామాలుగా పరిగణించాలని ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు నాన్ ట్రైబల్స్. 1950లో ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్‌లో మంగపేటలోని 23 గ్రామాలు లేవని వాదనలు వినిపించారు సీనియర్ అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి.


ఈ వార్తలు కూడా చదవండి...

మేడారం జాతరకు కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వట్లేదు: సీఎం రేవంత్‌

కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోంది.. ఎంపీ అర్వింద్ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 23 , 2025 | 05:52 PM