Local Body Elections: ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం
ABN , Publish Date - Dec 10 , 2025 | 08:02 AM
గ్రామపంచాయతీ ఎన్నిక ల్లో భాగంగా మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి మండలాలకు ఎన్నికలు జరగనుండగా ఈనెల 11న పోలింగ్ జరగనుంది.
భూపాలపల్లి జిల్లాలో నాలుగు - మండలాల్లో మొదటి విడత ఎన్నికలు
11న 73 సర్పంచ్, 712 స్థానాలకు పోలింగ్
భూపాలపల్లి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ ఎన్నిక ల్లో (Local Body Elections) భాగంగా మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి మండలాలకు ఎన్నికలు జరగనుండగా ఈనెల 11న పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో మొత్తం 82 గ్రామ పంచాయతీలకు 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
ప్రస్తుతం 71 గ్రామపంచాయతీలు, 712 వార్డులకు బ్యాలెట్ పోరు జరగనుంది. ఈ నాలుగు మండలాల్లో మొత్తం 259 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1282 మంది బార్డు మెంబర్ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. జిల్లా అధికార యంత్రాంగం పోలింగ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ముఖ్యంగా ఈ నాలుగు మండలాల్లోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక భద్రత చర్యలను చేపట్టారు.
పోలింగ్ గురువారం జరగనుండగా అదే రోజు ఫలితాలు వెలవడనుండటంతో గ్రామాల్లో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బలగాలను మోహరించారు. సుమారు 500 మందితో పటిష్ఠ భద్రతా చర్యలు చేపడుతున్నారు. పోలింగ్‌కు మరో 24 గంటలు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులంతా ఓటర్లను ఆకట్టుకునే పనిలో తలమునకలయ్యారు. ఇప్పటికే ఈ ఎన్నిక అధికార కాంగ్రెస్‌కు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంక టరమణారెడ్డి అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హరీశ్‌రావు కీలక లేఖ
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
Read Latest Telangana News and National News