Share News

Minister Uttam: పాకిస్తాన్‌కి ఇండియన్ ఆర్మీ సరైన గుణపాఠం చెప్పింది

ABN , Publish Date - May 08 , 2025 | 02:03 PM

Minister Uttam Kumar Reddy: భారత సైన్యానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ సరైన గుణపాఠం చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Minister Uttam: పాకిస్తాన్‌కి ఇండియన్ ఆర్మీ సరైన గుణపాఠం చెప్పింది
Minister Uttam Kumar Reddy

సూర్యాపేట : జమ్మూకశ్మీర్‌లో ఇటీవల భారత పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రమూకలు దాడులు చేశారు. ఈ దాడిలో 26 మంది అన్యాయంగా చనిపోయారు. ఈ ఘటనను ప్రపంచవ్యాప్తంగా ఖండించారు. పాకిస్తాన్ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే పాకిస్తాన్‌కు ధీటైన సమాధానం చెబుతామని ప్రధానమంత్రి నరేంద్‌మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.చెప్పినట్లుగానే పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత బలగాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


తాజాగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆపరేషన్ సిందూర్‌పై స్పందించారు. భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ పాకిస్థాన్, ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడులు విజయవంతంగా పూర్తి చేసిందని అన్నారు. భారత సైన్యం సమర్ధవంతంగా శత్రువుల మీద దాడి చేసి భారత సైన్య లక్ష్యాలను పూర్తి చేసి పాకిస్తాన్‌కి సరైన గుణపాఠం చెప్పిందని అన్నారు. మాజీ సైనికుడిగా భారత్ సైన్యానికి మంత్రి ఉత్తమ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారతసైన్యంపై ప్రశంసలు కురింపించారు. ఇవాళ(గురువారం)కోదాడ పట్టణంలో వెంకటేశ్వర మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. పట్టణంలో మెరుగైన వైద్యం సేవలు అందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.


కాగా.. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అవడంతో ఈరోజు(మే8) సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని భారత సైన్యానికి సంఘీభావంగా సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు. అయితే, ఆర్మీ సంఘీభావ ర్యాలీ భద్రతపై పోలీసులు సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రతను అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ పర్యవేక్షిస్తున్నారు. సెక్రటేరియట్ నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ చేయనున్నారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులు, పోలీసులు పాల్గొననున్నారు. సంఘీభావ ర్యాలీలో యువత పెద్ద ఎత్తున హాజరుకావాలని సీఎం రేవంత్‌‌రెడ్డి పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

Operation Sindoor: జమ్మూకాశ్మీర్‌లో పాక్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి

Operation Sindoor: రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్‌.. సిద్ధమైన క్షిపణులు..

Iran FM Seyed Araghchi: ఇండియా, పాక్ ఉద్రిక్తత వేళ ఇండియాకు ఇరాన్ మంత్రి

Pakistan: లాహోర్‌లో పేలుళ్లు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..

Read Latest International News And Telugu News

Updated Date - May 08 , 2025 | 02:09 PM