Jagadish Reddy: మాజీలను చేర్చుకుంటే బలపడతామని బీజేపీ భ్రమపడుతుంది : జగదీష్ రెడ్డి
ABN , Publish Date - Aug 10 , 2025 | 03:38 PM
కేసీఆర్‌ని అరెస్ట్ చేయడం కాంగ్రెస్ వల్ల కావడం లేదని, సీబీఐకి అప్పగిస్తే తాము అరెస్ట్ చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పోటీ పడుతున్నాడని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గల్లీ నాయకులకు ఢిల్లీ ప్రమోషన్లు వస్తే.. ఇలాంటి పనులే చేస్తారని ఎద్దేవా చేశారు.
సూర్యాపేట : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ సహకారంతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌ను లేవనీయకుండా చేయాలనే కుట్ర చేస్తుందని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ కోసం కాంగ్రెస్ తాపత్రయపడుతోందని తెలిపారు. రేపటి తెలంగాణ కేసీఆర్ దేనని తెలిసే.. ఇరు పార్టీలు కలిసి కుయుక్తులు పన్నుతున్నాయని విమర్శించారు.
కేసీఆర్‌ని అరెస్ట్ చేయడం కాంగ్రెస్ వల్ల కావడం లేదని, సీబీఐకి అప్పగిస్తే తాము అరెస్ట్ చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పోటీ పడుతున్నారని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గల్లీ నాయకులకు ఢిల్లీ ప్రమోషన్లు వస్తే.. ఇలాంటి పనులే చేస్తారని ఎద్దేవా చేశారు. వారికి ప్రమోషన్లు రావడం వల్లే రాష్ట్ర ప్రజలకు కష్టాలొచ్చాయని చెప్పుకొచ్చారు. మాజీలను చేర్చుకుంటే బలపడతామని బీజేపీ భ్రమపడుతుందని విమర్శించారు. ప్రధాని మోదీ పని అయిపోయిందని, ఇతరుల ఆక్సిజన్ మీద నడిచే పార్టీ బీజేపీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో దమ్ముంటే కుటుంబంతో బండి సంజయ్ గుడిలో ప్రమాణం చేయాలని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు.
కొండా మురళితో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం.. ఎందుకంటే..
కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదంటే.. కవిత షాకింగ్ కామెంట్స్