Congress: కొండా మురళితో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం.. ఎందుకంటే..
ABN , Publish Date - Aug 10 , 2025 | 02:03 PM
తమ రక్తంలో కాంగ్రెస్ ఉందని ఆ పార్టీ నేత కొండా మురళి తెలిపారు. కాంగ్రెస్‌లో తప్పా వేరే పార్టీలో తాము ఇమడలేమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఏ ఆదేశం ఇచ్చినా పాటిస్తానని అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన లక్ష్యమని కొండా మురళి ఉద్ఘాటించారు.
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ (Congress Disciplinary Committee) పిలుపు మేరకు గాంధీ భవన్‌కు ఇవాళ(ఆదివారం) ఆ పార్టీ సీనియర్ నేత కొండ మురళీ వచ్చారు. తనపై వచ్చిన ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీకి లిఖితపూర్వకంగా కొండా మురళీ సమాధానం ఇచ్చారు. కొండా మురళీ లేఖపై కమిటీ కొన్ని వివరాలు అడిగింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మల్లు రవి మాట్లాడారు.
రెండు గంటల పాటు సమావేశం జరిగిందని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలపై చర్చ చేశామని చెప్పుకొచ్చారు. అనిరుధ్ రెడ్డి అంశంపై చర్చించామని అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అంశంపై ఇంకా చర్చ జరగలేదని చెప్పారు. రాజ్ గోపాల్ రెడ్డిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని మల్లు రవి పేర్కొన్నారు.
మా రక్తంలో కాంగ్రెస్ ఉంది: కొండా మురళి
తమ రక్తంలో కాంగ్రెస్ ఉందని ఆ పార్టీ నేత కొండా మురళి (Konda Murali) తెలిపారు. కాంగ్రెస్‌లో తప్పా వేరే పార్టీలో తాము ఇమడలేమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హై కమాండ్ ఏ ఆదేశం ఇచ్చినా పాటిస్తానని అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పని చేయాలని క్రమశిక్షణ కమిటీ ఆదేశించిందని కొండా మురళి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదంటే.. కవిత షాకింగ్ కామెంట్స్
రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్‌పై మాటమార్చిన మాజీమంత్రి మల్లారెడ్డి
For More Telangana News And Telugu News