Share News

Rain Alert: ఏపీ, తెలంగాణలో వర్షాల జోరు.. ఆగస్టు 14-17 వరకు హై అలర్ట్

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:01 AM

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మళ్లీ మారనుంది. ఎందుకంటే ఈ నెల 13 నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం (LPA) ఏర్పడబోతోంది. ఈ కారణంగా రెండు రాష్ట్రాల్లో గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

Rain Alert: ఏపీ, తెలంగాణలో వర్షాల జోరు.. ఆగస్టు 14-17 వరకు హై అలర్ట్
rain alert ap Telangana August 14 to 17th 2025

తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే వాతావరణం మళ్లీ ఒక్కసారిగా మారబోతుంది. ఈ నెల 13వ తేదీ నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం (LPA) ఏర్పడబోతోంది. ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు తెలంగాణతోపాటు ఏపీలో కూడా ప్రభావం చూపించనున్నాయి (Rain Alert AP and Telangana).


కమ్ముకుంటున్న వర్షాలు

ఈ నేపథ్యంలో ఈ రోజు (ఆగస్టు 10) తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు, అంటే 11వ తేదీన, ఈ ప్రభావం 19 జిల్లాల్లో కనిపించనుంది. అంటే దాదాపు రాష్ట్రం మొత్తం వర్షం ప్రభావం కనిపించనుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాబోయే 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.


హై అలర్ట్

ఈ క్రమంలో ఆగస్టు 14 నుంచి 17 వరకు తెలంగాణ అంతటా వర్షాల హెచ్చరిక జారీ అయింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఒకటి లేదా రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) నాడు కూడా వర్షాలు జోరుగా కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అందుకే, ఆ రోజు బయటకు వెళ్లే ప్లాన్ ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండండి.


జాగ్రత్తలు తీసుకోండి

  • ముఖ్యంగా భారీ వర్షాల సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి

  • వరదలు వచ్చే ప్రాంతాలకు దూరంగా ఉండండి.

  • అత్యవసర సందర్భాల్లో స్థానిక అధికారుల సూచనలు పాటించండి

  • తాజా వాతావరణ అప్‌డేట్స్ కోసం రేడియో, టీవీ లేదా సోషల్ మీడియాను ఫాలో అవ్వండి

  • ముసురు మళ్లీ వస్తోంది, కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి. వర్షం ఆనందాన్ని తెచ్చినా, జాగ్రత్తలు మర్చిపోవద్దు


ఇవి కూడా చదవండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 10 , 2025 | 11:22 AM