Srushti Hospital Case: కీలక పరిణామం.. సృష్టి హాస్పిటల్ కేసులోకి ఈడీ ఎంట్రీ
ABN , Publish Date - Aug 10 , 2025 | 09:18 AM
Srushti Hospital Case: సృష్టి హాస్పిటల్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీల్యాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీసులకు లేఖ రాశారు.
సృష్టి హాస్పిటల్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీల్యాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీసులకు లేఖ రాశారు. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఆమె కోట్లు సంపాదించినట్లు సమాచారం.
కాగా, కొన్నిరోజుల క్రితం విజయవాడ పోలీసులు నవజాత శిశువును అమ్ముతున్న గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో అజితిసింగ్ నగర్‌కు చెందిన ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ గ్యాంగ్ హైదరాబాద్‌నుంచే పనిచేసేది. పిల్లలను అమ్మే గ్యాంగులు విజయవాడలో మూడు, నాలుగు ఉన్నాయి. ఈ గ్యాంగులతో సృష్టికి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ గ్యాంగ్ హైదరాబాద్‌లోని సృష్టి ఆఫీస్‌కు, విజయవాడ బ్రాంచ్‌కు వెళ్లినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
జగ్గయ్యపేటలో వరుస చైన్ స్నాచింగ్‌లు.. పోలీసులకు చిక్కిన నిందితులు
కీలక పరిణామం.. సృష్టి హాస్పిటల్ కేసులోకి ఈడీ ఎంట్రీ