Chain Snatching Gang Arrest: జగ్గయ్యపేటలో వరుస చైన్ స్నాచింగ్‌లు.. పోలీసులకు చిక్కిన నిందితులు
ABN , Publish Date - Aug 10 , 2025 | 09:36 AM
జగ్గయ్యపేట, నందిగామలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ముగ్గురు నిందితులను జగ్గయ్యపేట ఎస్సై రాజు శనివారం అరెస్టు చేశారు. జగ్గయ్యపేటలో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు వచ్చి అతడు దొరక్కపోవటంతో అతడు బైక్‌ను ఎత్తుకెళ్లిన నిందితులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడటం విశేషం. చైన్ స్నాచింగ్ కోసం దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ సుఫారీ విషయం వెల్లడైంది.
» హత్యకు వచ్చి చైన్ స్నాచింగ్
» జగ్గయ్యపేట, నందిగామ వరుస చోరీల్లో కొత్త కోణం
» సీసీ కెమెరాల ఆధారంగా సుపారీ గ్యాంగ్ నిందితుల గాలింపు
» వారం రోజుల్లోనే చేధించిన ఎస్సై రాజు
జగ్గయ్యపేట, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): జగ్గయ్యపేట (Jaggaiahpet), నందిగామలో (Nandigama) వరుస చైన్ స్నాచింగ్‌లకు (Chain Snatching) పాల్పడిన ముగ్గురు నిందితులను జగ్గయ్యపేట ఎస్సై రాజు శనివారం అరెస్టు చేశారు. జగ్గయ్యపేటలో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు వచ్చి అతడు దొరక్కపోవటంతో అతడు బైక్‌ను ఎత్తుకెళ్లిన నిందితులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడటం విశేషం. చైన్ స్నాచింగ్ కోసం దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ సుఫారీ విషయం వెల్లడైంది. నిందితుల నుంచి నందిగామ, జగ్గయ్యపేటలో చోరీ చేసిన రూ.6.50 లక్షల విలువైన 82 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 1న జగ్గయ్యపేటకు చెందిన గింజుపల్లి కరుణ, పూర్ణచంద్రరావు దంపతులు టీవీఎస్ ఎక్సెల్‌పై బంధువుల పరామర్శకు వెళ్లి వస్తుండగా అదే మార్గంలో పల్సర్ బైక్‌పై వచ్చిన అగంతకులు చిల్లకల్లు దాటాక వెనుక నుంచి జగ్గయ్యపేట రోడ్డులో పెట్రోల్ బంకు వద్ద మెడలో చైన్ తెంపుకుని పరారయ్యారు. పూర్ణచంద్రరావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన ఎస్సై జీ రాజు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సీఐ వెంకటేశ్వర్లు సూచనలు, ఉన్నతాధికారుల సహకారంతో విచారణ ప్రారంభించారు. మంగళగిరికి చెందిన గొల్ల గోపీ కొంతకాలంగా జగ్గయ్యపేట పట్టణ శివారు ధనంబోడు ఇందిర ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన వేముల తిరుపతిరావు ఆటో తోలుతుండగా పరిచయమైంది. చెరువు బజారు చెందిన తన బావ తానూరి శ్రీనును హత్య చేసిన బత్తుల కిశోర్ బాబుపై ప్రతీకారంగా హత్య చేసేందుకు గోపీ తన మిత్రులు మంగళగిరి మండలం కొత్తపేటకు చెందిన మచ్చ వెంకటేష్ (32), లక్ష్మీనరసింహకాలనీకి చెందిన పఠాన్ సలీంబాషా (30)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. నెల క్రితం బత్తుల కిశోర్ బాబు ఇంటికి వెళ్లి రెక్కీ నిర్వహించారు. కిశోర్ లేకపోవటంతో అతడి పల్సర్ బైక్‌ను ఎత్తుకెళ్లారు. అప్పటి నుంచి బైజైపై తిరుగుతూ ప్లాన్ వేస్తున్నారు. ఆ పథకం పారక ముందు నందిగామ తర్వాత జగ్గయ్యపేటలో ఒకేరోజు వరుసగా మూడు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులకు సవాల్ విసరటంతో టెక్నాలజీ, సీసీ కెమెరాల ఆధారంగా శోధించిన ఎస్సై రాజుకు వారు దొరికిపోయారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సలీం బాషాపై తాడేవల్లి, ఆత్కూరు పోలీస్ స్టేషన్లలో 9 కేసులుండగా, మచ్చ వెంకటేష్‌పై చీరాల, తాడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో 7 కేసులు, హత్యకు సఫారి మాట్లాడిన వేముల తిరుపతిరావుపై పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైనట్లు చెప్పారు. బత్తుల తిరుపతిరావుతో స్నేహంతో గోపి కిశోర్ హత్యకు పాత స్నేహితులతో సుఫారి మాట్లాడాడు. గోపీ పరారీలో ఉండగా మిగిలిన ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 21 రోజుల రిమాండ్ విధిం చిందని ఎస్సై తెలిపారు. కాగా బత్తుల కిశోర్ చెరువు బజార్‌లో పూజారి హత్య కేసులో కండీషన్ బెయిల్‌పై పోలీస్ స్టేషన్‌కు వస్తున్నా బైక్ పోయిన విషయంపై ఫిర్యాదు చేయకపోవటం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు రైళ్లు రద్దు.. గమ్యాల కుదింపు
డాలర్ డ్రీమ్స్‌తోపాటు జీవన నైపుణ్యాలు అవసరం
For More AP News and Telugu News