Share News

Minister Adluri Laxman VS Ponnam Prabhakar: మంత్రి పొన్నం వ్యాఖ్యలు కించపరిచాయి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన

ABN , Publish Date - Oct 07 , 2025 | 08:42 PM

మంత్రి పొన్నం ప్రభాకర్ తనను అలా అనడం బాధ కలిగించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు తన సామాజిక వర్గాన్ని కించపరిచాయని వాపోయారు.

Minister Adluri Laxman VS Ponnam Prabhakar: మంత్రి పొన్నం వ్యాఖ్యలు కించపరిచాయి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన
Minister Adluri Laxman VS Minister Ponnam Prabhakar

జగిత్యాల, అక్టోబరు7 (ఆంధ్రజ్యోతి): మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తనను అలా అనడం బాధ కలిగించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Minister Adluri Laxman) ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు తన సామాజిక వర్గాన్ని కించపరిచాయని వాపోయారు. ఇవాళ(మంగళవారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ సామాజిక వర్గం తనకు అండగా నిలిచిందని ఉద్ఘాటించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్.


పొన్నం వ్యాఖ్యలను మరో మంత్రి వివేక్ వెంకటస్వామి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పుకొచ్చారు. వివేక్ తండ్రి వెంకటస్వామికి గతంలో తాము అండగా ఉన్నామని గుర్తుచేశారు. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తనతో మాట్లాడారని తెలిపారు. రేపు(బుధవారం) ఉదయం వారిని కలుస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2025 | 08:58 PM