Share News

Pawan Kalyan: కొండగట్టుకు పవన్ కల్యాణ్.. ముహూర్తం ఫిక్స్..

ABN , Publish Date - Dec 29 , 2025 | 05:05 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టును సందర్శించనున్నారు. జనవరి మూడో తేదీన డిప్యూటీ సీఎం కొండగట్టుకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

 Pawan Kalyan: కొండగట్టుకు  పవన్ కల్యాణ్.. ముహూర్తం ఫిక్స్..
Pawan Kalyan

జగిత్యాల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టును (Kondagattu) సందర్శించనున్నారు. జనవరి మూడో తేదీన డిప్యూటీ సీఎం కొండగట్టుకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.


తన పర్యటనలో భాగంగా కొండగట్టులో ఆలయ అభివృద్ధికి సంబంధించి కీలక కార్యక్రమాలను ఆయన చేపట్టనున్నారు. టీటీడీ నిధులతో సుమారు రూ.35 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఆలయ మౌలిక వసతులు, భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరచే దిశగా ఉండనున్నాయి.


కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో ఏపీ రాజకీయాలకు సంబంధించి ఎన్డీఏ కూటమి పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ ఇదే ఆలయం నుంచి ప్రకటన చేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్న ఆలయానికి వస్తుండటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.


ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొండగట్టుకు వచ్చి అంజన్న స్వామిని దర్శించుకోవడం పవన్ కల్యాణ్ విశేషంగా భావిస్తున్నారు. ఈ పర్యటన రాజకీయంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పవన్ కల్యాణ్ రాకతో కొండగట్టు ప్రాంతంలో భక్తులు, ఆయన అభిమానుల భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

హరీశ్‌రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ఫైర్

మాధవీలతకు బిగ్ షాక్.. కేసు నమోదు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 29 , 2025 | 05:29 PM