TG Government on BC Reservations: బిగ్ బ్రేకింగ్.. బీసీ రిజర్వేషన్ల జీఓ విడుదల
ABN , Publish Date - Sep 26 , 2025 | 08:26 PM
బీసీ రిజర్వేషన్ల జీఓను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ (శుక్రవారం) విడుదల చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ -09 విడుదల చేసింది రేవంత్‌రెడ్డి సర్కార్.
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల జీఓ (BC Reservations GO)ను తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఇవాళ (శుక్రవారం) విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ- 09 విడుదల చేసింది రేవంత్‌రెడ్డి సర్కార్. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు తెలంగాణ ఎన్నికల సంఘం అత్యవసరంగా సమావేశం కానుంది. సీఎస్, డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై ఎస్ఈసీ చర్చించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రేపు లేదా ఎల్లుండి (ఆదివారం) ఎన్నికల సంఘం అధికారులు మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే ఛాన్స్ ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అలర్ట్.. విమానాల దారి మళ్లింపు.. అసలు విషయమిదే..
కేసీఆర్ చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది: మాగంటి సునీత
For More TG News And Telugu News