CM Revanth Discussion on Musi Plan: మూసీ మాస్టర్ ప్లాన్‌పై చర్చ.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
ABN , Publish Date - Aug 27 , 2025 | 08:10 PM
మూసీ రివర్ డెవలప్‌మెంట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): మూసీ రివర్ డెవలప్‌మెంట్‌పై (Musi River Development Master Plan) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో ఇవాళ (బుధవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలిచ్చారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. గేట్ వే ఆఫ్ హైదరాబాద్, గాంధీ సరోవర్ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూసీ నదీ పరివాహక అభివృద్ధి జరగాలని మార్గనిర్దేశం చేశారు. గాంధీ సరోవర్ అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లు పరిశీలించారు. అభివృద్ధి పర్యావరణహితంగా ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. మీరాలం చెరువు అభివృద్ధి, ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రణాళికలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వీలైనంత త్వరగా డీపీఆర్ సిద్ధం చేసి పనులు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఈ సమీక్షా సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, MA&UD సెక్రటరీ (హెచ్‌ఎండీఏ ఏరియా) ఇలంబర్తి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎఫ్‌సీడీఏ కమిషనర్ కె. శశాంక, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎండీ అశోక్ రెడ్డి, ఎంఆర్‌డీసీఎల్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, జేఎండీ పి.గౌతమి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
స్వర్ణగిరి ఆలయ థీమ్‌తో బాలాపూర్ గణేష్ మండపం
తెలంగాణలో భారీ వర్షాలు.. జిల్లాల వారీగా హై అలర్ట్
Read Latest Telangana News and National News