Share News

Jubilee Hills Bye Poll: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల

ABN , Publish Date - Aug 20 , 2025 | 08:17 PM

జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్‌‌పై ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ సమావేశమయ్యారు.

Jubilee Hills Bye Poll: జూబ్లీహిల్స్  బై ఎలక్షన్.. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల
Jubilee Hills Bye Poll

హైదరాబాద్, ఆగస్టు20 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ (Jubilee Hills Bye Poll) కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్‌‌పై ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఇవాళ(బుధవారం) సమావేశమయ్యారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 17వ తేదీ వరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమం ఉంటుందని ఆర్వీ కర్ణన్ తెలిపారు.


జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు తప్పనిసరిగా ఓటు నమోదు చేయాలని సూచించారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 17వ తేదీ వరకు క్లెయిమ్స్ , అబ్జెక్షన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 25వ తేదీ లోపు క్లెయిమ్స్, అబ్జెక్షన్ల డిస్పోజల్ ఉంటుందని వెల్లడించారు. సెప్టెంబర్ 30వ తేదీన ఫైనల్ ఓటరు జాబితా పబ్లికేషన్ ఉంటుందని వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు రివిజన్‌‌లో సహకరించాలని ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, ఎంఐఎం, బహుజన సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ, సీపీఎం పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్

హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 20 , 2025 | 08:47 PM