AV Ranganath: బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్
ABN , Publish Date - Aug 20 , 2025 | 07:10 PM
బతుకమ్మ కుంట అభివృద్ధిపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం పరిశీలించారు. చెరువును కాపాడేందుకు శాశ్వత సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
హైదరాబాద్, ఆగస్టు20 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ కుంట అభివృద్ధిపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) ఇవాళ(బుధవారం) పరిశీలించారు. చెరువును కాపాడేందుకు శాశ్వత సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. బతుకమ్మ పండగ వచ్చే లోపు చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువు నిర్మాణం పూర్తయిందని.. సుందరీకరణ పనులు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. చెరువు మధ్యలో బతుకమ్మ ప్రతిబింబించే నిర్మాణం ఏర్పాటు చేయాలని సూచించారు రంగనాథ్.
చెరువు చుట్టూ అందమైన మొక్కలు, ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని దిశానిర్దేశం చేశారు. పెద్దలు సేదతీరే గుమ్మటాలు, హైజెనిక్ రెస్ట్ రూమ్‌ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెరువు చుట్టూ వాక్ వే, చెట్ల పెంపకం, వాకర్స్ కూర్చునే ఏర్పాట్లు చేయాలని సూచించారు. చెరువు ఇన్ లెట్ - ఔట్ లెట్ వ్యవస్థలు సరిగా పనిచేసేలా చూడాలని మార్గనిర్దేశం చేశారు. వర్షాకాలంలో వరదనీరు కాలనీలను ముంచకుండా నేరుగా చెరువులోకి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువు నిండిన తర్వాత నీరు కిందకు సులభంగా వెళ్లేలా అవాంతరాలు లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. బతుకమ్మ కుంటను వరద నివారణ, భూగర్భజలాల పెంపు, పర్యావరణ పరిరక్షణలో నమూనాగా తీర్చిదిద్దాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బెట్టింగ్ యాప్స్‌పై కేంద్రం బిల్లు.. సజ్జనార్ ఏమన్నారంటే..
రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Read latest Telangana News And Telugu News