KTR Fires On CM Revanth: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:45 PM
KTR Fires On CM Revanth: సెప్టెంబర్ 9లోపు తెలంగాణకు ఎవరు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తే వారికే తమ మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 9లోపు తెలంగాణకు ఎవరు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తే వారికే తమ మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రైతులకు యూరియా మోదీ ఇస్తే ఎన్డీఏకు, రాహుల్ ఇస్తే ఇండి కూటమికి మద్దతు ఇస్తామన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘రేవంత్ రెడ్డి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీ.
ఇండి కూటమి అభ్యర్థిని రేవంత్ రెడ్డి పెడితే కచ్చితంగా వ్యతిరేకిస్తాం. రేవంత్‌కు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే.. బీసీ అభ్యర్థిని ఎందుకు పోటీలో పెట్టలేదు?. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరకి మద్దతు ఇవ్వాలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మద్దతు కోసం ఇప్పటివరకు మమల్ని ఏ కూటమి సంప్రదించలేదు. ఎన్డీఏ, ఇండి ఏ కూటమిలోనూ బీఆర్ఎస్ భాగస్వామి కాదు.
మద్దతు కోసం మాకు ఢిల్లీ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. మా బాస్ తెలంగాణ ప్రజలే. మాకు బాసులు ఢిలీలో లేరు. బీఆర్ఎస్ స్వతంత్ర పార్టీ. బీసీలపై ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి కంచె ఐలయ్యను ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా పెట్టొచ్చు కదా?’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
వీళ్ల పట్టుదలకు సలాం చెప్పాల్సిందే.. లైట్ లేకపోయినా ఎలా పని చేస్తున్నారో చూడండి..
మద్యం షాపుల లైసెన్స్‌లపై ప్రభుత్వం కీలక నిర్ణయం