Liquor Shops License Fees: మద్యం షాపుల లైసెన్స్‌లపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:44 PM
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది నవంబర్ 30వ తేదీతో మద్యం షాపుల లైసెన్లులు ముగియనున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 20: తెలంగాణలో మద్యం షాపుల లైసెన్స్ గడువు మరి కొద్ది రోజుల్లో ముగియనుంది. అలాంటి వేళ రేవంత్ సర్కార్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలో జనాభా ప్రాతిపదికన లిక్కర్స్ షాప్స్‌కు లైసెన్స్ ఫీజును ప్రభుత్వం ఖరారు చేసింది. ఐదు వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో వైన్స్ షాపు లైసెన్స్ ఫీజు రూ. 50 లక్షలుగా ఖరారు చేసింది. ఇక ఐదు వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉంటే.. రూ. 55 లక్షలు, అలాగే 50 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉంటే రూ. 60 లక్షలు, లక్ష జనాభా నుంచి ఐదు లక్షల జనాభా ఉంటే.. రూ. 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ. 85 లక్షలు, 20 లక్షలకు పైగా ఉన్న ప్రాంతాల్లో రూ. కోటి పది లక్షల లైసెన్స్ ఫీజు కింద చెల్లించాలని అబ్కారీ శాఖ నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది నవంబర్ 30వ తేదీతో మద్యం షాపుల లైసెన్లులు ముగియనున్నాయి. వచ్చే విడతకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను అబ్కారీ శాఖ ముందుగానే కసరత్తు చేపట్టింది. అందులోభాగంగానే ఈ లైసెన్స్ ఫీజును నిర్ణయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
యాత్రికులకు అలర్ట్.. ఆగిన పాపికొండల విహారయాత్ర..
పెట్రోల్ పోసి టీచర్‌కు నిప్పు పెట్టి విద్యార్థి
For More TG News And Telugu News